Kushaiguda: ఆర్టీసీ ఆధ్వర్యంలో బాబూజీకి నివాళి.. సమసమాజ స్థాపనే ఆయన లక్ష్యం

Kushaiguda: హైదరాబాద్‌లోని కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.

ASHOK, KAPRA
Published on: 5 April 2026 8:14 PM IST
Kushaiguda
X

Kushaiguda: ఆర్టీసీ ఆధ్వర్యంలో బాబూజీకి నివాళి.. సమసమాజ స్థాపనే ఆయన లక్ష్యం

Kushaiguda: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపోలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి ఘనంగా వేడుకలు నిర్వహించారు దళితుల అభ్యుదయానికి నిరంతరం కృషి చేసిన సంఘసంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కుషాయిగూడ డిపో మేనేజర్ వి.వేణుగోపాల్ కొనియాడారు శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి సందర్భంగా డిపో మేనేజర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి సమ సమాజ స్థాపనకు జీవితకాలం శ్రమించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు దేశానికి ఆయన చేసిన సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు 40 సంవత్సరా లు సుదీర్ఘంగా పార్లమెంటులో శాసనసభలో వివిధ హోదాలలో పని చేసి బడుగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తన సేవలను అందించారు అని అన్నారు.

రాజ్యాంగం లోని చట్టాలను సవరణలను హక్కులను బడుగు బలహీన వర్గ ప్రజల అభివృద్ధికి ఉపయోగించిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి వెల్ఫేర్ మెంబర్ రాములు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సెక్రెటరీ పండరి కౌసల్య, నర్సింగరావు, ఆనంద్,హరీష్,సాయిరాం, జంగయ్య ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సభ్యులు ఆర్టీసీ ఎంప్లాయిస్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story