Mehfil: మెఫిల్ రెస్టారెంట్లో కుళ్ళిన ఆహారం.. ప్రశ్నిస్తే కస్టమర్లపై దాడి!
Mehfil: ఏ.ఎస్.రావు నగర్ మెఫిల్ రెస్టారెంట్లో కలకలం. కుళ్ళిన బిర్యానీ, స్వీట్ ఇచ్చారని ప్రశ్నించిన వినియోగదారులపై యాజమాన్యం దాడి.
Mehfil: మెఫిల్ రెస్టారెంట్లో కుళ్ళిన ఆహారం.. ప్రశ్నిస్తే కస్టమర్లపై దాడి!
Mehfil: ఏ.ఎస్.రావు నగర్ లోని మెఫిల్ రెస్టారెంట్ లో బిర్యానీ తిందామని వెళ్ళిన సత్తిరెడ్డి, నరేష్, గణేష్ అనే వినియోగదారులకు మెఫిల్ రెస్టారెంట్ వాళ్లు చల్లగా ఉన్న టేస్ట్ లేని బిర్యానీ, కుళ్ళిన చెడువాసన వస్తున్న ఖద్దూ కా కీర్ స్వీట్ ఇచ్చారు. దీనితో వినియోగదారులు చెడు వాసన రావడంతో రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే ఆ సిబ్బంది బాగానే ఉందని బిర్యానీ, స్వీట్ ను తీసుకెళ్లి మార్చి ఇస్తామని చెప్పారు, అదేంటి కుళ్ళిన, చెడు వాసన వస్తున్న బిర్యానీ, స్వీట్ ఎలా ఇస్తారని ప్రశ్నించి అధికారులకు పిర్యాదు చేస్తామని తెలుపడంతో.
రెస్టారెంట్ యాజమాన్యం వచ్చి మాపై అన్యాయంగా దాడి చేశారని వినియోగదారులు సత్తిరెడ్డి, నరేష్, గణేష్ లు ఆరోపించారు. ఈ సందర్భంగా వినియోగదారులు మాట్లాడుతూ టేస్ట్ లేని వాసన వస్తున్న బిర్యానీ, కుళ్ళిన చెడువాసన వస్తున్న స్వీట్ ఇచ్చిన రెస్టారెంట్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ రెస్టారెంట్ నిర్వాహకులు కుళ్ళిన చికెన్, చెడిపోయిన బిర్యానీ ఫ్రిడ్జ్ లో పెట్టీ మరునాడు ఇస్తున్నారని అనుమానం వస్తుందని వెంటనే పోలీసుపు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. పిర్యాదు అందుకున్న కుషాయిగూడ పోలీసులు రెస్టారెంట్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్ కు తరలించారు.అలాగే రెస్టారెంట్ ముందు ప్రధాన రహదారి ఫుట్ పాత్ పై వాహనాలు నిలపడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుందని వాహనదారులు తెలిపారు.




