Karimnagar: డ్రైవర్ల కంటి వెలుగు.. రోడ్డు ప్రమాదాలకు చెక్!

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లో డ్రైవర్ల కోసం "అరైవ్ అలైవ్" పేరుతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 28 March 2026 2:55 PM IST
Karimnagar
X

Karimnagar: డ్రైవర్ల కంటి వెలుగు.. రోడ్డు ప్రమాదాలకు చెక్!

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లో రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ “అరైవ్ అలైవ్” కార్యక్రమం పేరిట ఆటో, కార్, బస్, లారీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. రోజువారీగా వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి చూపు స్పష్టంగా ఉండటం ఎంతో కీలకమని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరానికి మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.

పరీక్షల ద్వారా కంటి సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన వారికి వైద్యుల సూచనలతో పాటు చికిత్సలు అందించేలా చర్యలు తీసుకున్నారు. డ్రైవర్లు సురక్షితంగా వాహనాలు నడపాలంటే వారి ఆరోగ్యం ముఖ్యమని, ముఖ్యంగా కంటి చూపు బాగుంటేనే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో డి. రాము, ఏసీపీ విజయ్ కుమార్, ట్రాన్స్‌పోర్ట్ శాఖ అధికారులు, మధురానగర్ సర్పంచ్ వేముల భాస్కర్ తదితరులు పాల్గొని డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story