Armoor: కోర్టులో కేసు ఉన్నా ఆగని వైద్యం.. అక్రమ క్లినిక్ సీజ్!
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అక్రమంగా నడుస్తున్న ప్రియాంక క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు.
Armoor: కోర్టులో కేసు ఉన్నా ఆగని వైద్యం.. అక్రమ క్లినిక్ సీజ్!
ఆర్మూర్ న్యూస్: జిల్లా ఆర్మూర్ కేంద్రంలో నడుస్తున్న ' ప్రియాంక క్లినిక్' ఫై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పుడు డిహెచ్ఎంఓ రవీందర్ ఆధ్వర్యంలో క్లినిక్ సీజ్ చేశారు, గతంలో ఉన్న డిహెచ్ఎంఓ ఉన్నప్పుడు కూడా ఇలానే తనిఖీలు చేశారు, అప్పుడు ఇప్పుడు సీజ్ చేసిన సమయంలో పోలీసులు సిబ్బంది కూడా హాజరయ్యారు.
అందిన సమాచారం ప్రకారం, ఈ క్లినిక్ అనేక సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు లేకుండా, అక్రమంగా నరుస్తుంది, అది అధికారులకు తెలిసిన విషయమే, ఇక్కడ పురుషులు, మహిళలు, వివిధ వ్యాధులు చికిత్స పేరుతో చేసిన శస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి, నాణ్యతం లేని వైద్యం కారణంగా రోగులు ఆరోగ్యం పొందకుండా మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు.
డిఎంహెచ్వో మాట్లాడుతూ గత 2025 వ సంవత్సరంలో కూడా డిఎంహెచ్వో రాజశ్రీ మేడం ఫిర్యాదు మేరకు ఈ క్లినిక్ ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు, ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణ ఉందన్నారు, అయితే క్లినిక యజమాన్యం మళ్లీ అక్రమంగా ప్రారంభించి రోగులకు చికిత్స అందడంతో తాజా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించగా, క్లీనిగ్ తిరిగి నడుస్తున్నట్లు గుర్తించి, వెంటనే మళ్లీ సీజ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు.


