Armoor: నిద్రలో ఉండగా షాక్.. ఇంటి ముందున్న వాహనం దగ్ధం!
Armoor: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ అన్నపూర్ణ కాలనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది.
Armoor: నిద్రలో ఉండగా షాక్.. ఇంటి ముందున్న వాహనం దగ్ధం!
ఆర్మూర్ న్యూస్: పట్టణ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, కోటర్మూర్ 6th వార్డులో అన్నపూర్ణ కాలనీలో అర్ధరాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది, గొట్టడి నేహా, భర్త శ్రీనివాస్ కు చెందిన సుజుకి స్కూటీ కి అనురాస్యంగా అగ్నికి అహుతై పూర్తిగా కాలిపోయింది, బాధితురాలు వివరాల ప్రకారం ఆరు నెలల క్రితం కొత్త కొనుక్కులు చేసిన స్కూటీ నీ, రాత్రి సుమారు 12 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు అంటుకుని కాళీ బూడిదైంది.
ఈ ఘటన గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు, సమాచారం అందుకున్న పోలీసులు కాలిపోయిన స్కూటీని పరిశీలించారు, బాధితురాలు నేహా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అగ్రి ప్రమాదానికి గల కారణం పై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు, ఈ ఘటనతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.




