Armoor: రాష్ట్ర స్థాయిలో మెరిసిన ఆర్మూర్ విద్యార్థులు
Armoor: ఆర్మూర్ క్షత్రియ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులతో సత్తా చాటారు.
Armoor: రాష్ట్ర స్థాయిలో మెరిసిన ఆర్మూర్ విద్యార్థులు
Armoor: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పట్టణంలో ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి మార్కులతో క్షత్రియ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనిపించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ నందు ఎస్ నిర్ణయ శ్రీ 1000 మార్కులకు గాను 994, ఏ వైష్ణవి 990 ఎస్ రిషిక 990, బైపీసీ విభాగంలో మసియా ఫాతిమా 987 సిహెచ్ సంతోషిని 985 మరియు సి ఈ సి లో తనిష్క కుమారి 986 మార్కులు సాధించారు.
అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 469 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానం మార్కులు సాధించారు. అభినయ 465 సానియా 465 సుమయ్య మహావిశ్ 465 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో అబ్దుల్ ముదస్సిర్ 436 నిస్సి 436 ఈ ప్రాణం 436 కే అనిష్ 435 మరియు కె శ్రీ వల్లి 435 మార్కులు సాధించారు.
అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను కే ఇలిషా రాణి 485 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను సన్మానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ సెక్రెటరీ అల్జాపూర్ దేవేందర్ వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ కోశాధికారి గంగాధర్ డైరెక్టర్ వీరేంద్ర ప్రిన్సిపల్ ఎస్ నాగేశ్వరరావు మరియు అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులను అభినందించడం జరిగింది.




