Jukkal: అప్పుడు రక్షణ కవచాలు.. ఇప్పుడు భయపెడుతున్న బురుజులు!
Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక బురుజులు శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.
Jukkal: అప్పుడు రక్షణ కవచాలు.. ఇప్పుడు భయపెడుతున్న బురుజులు!
జుక్కల్ (కామారెడ్డి): శతాబ్దాలుగా గ్రామలకు రక్షణ కవచాలుగా ఆనాటి నుండి నిలిచిన పురాతన బురుజులు రోజురోజుకు శిధిలావస్థకు చేరుతున్నాయి.పురాతన బురుజులపై పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గత చరిత్రకు సాక్ష్యంగా నిలవాల్సిన బురుజులు శిధిలావస్థకు చేరి కూలిపోతున్నాయి.జుక్కల్ నియోజక వర్గం లోని బిచ్కుంద, బిచ్కుంద మండలం పుల్కాల్, ఖాత్ గావ్, జుక్కల్ మండలం జుక్కల్, పెద్ద ఎడ్గి, మాదాపూర్, బంగారు పల్లి, మద్నూర్ మండలం పెద్ద తాడ్గుర్, మద్నూర్, మెనూర్, పిట్లం మండలం చిల్లర్గి, పిట్లం, పెద్ద కొడప్ గల్ లలో చరిత్ర ను గుర్తు చేసే పురాతన బురుజులు ప్రస్తుతం శిధిలావస్థకు చేరుకొని గ్రామ ప్రజల భయాందోళనకు కారణమవుతున్నాయి.
శత్రువుల దాడుల నుండి కాపాడే ఆనాటి బురుజులు
ఆనాటి పాలకులు తమ గ్రామాలను శత్రువుల దాడుల నుండి రక్షించేందుకు , గ్రామ పరిస్థితులను పర్యవేక్షించేందుకు గాను గ్రామ ముఖ ద్వారాలలో, గ్రామ మధ్య భాగంలో ఈ బురుజులను నిర్మించినట్లు పెద్దలు చెబుతున్నారు.కాలక్రమేనా ఇవి గ్రామ చరిత్రకు ప్రతీకలుగా నిలిచిన , ప్రస్తుతం పాలకులు, అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకరంగా మారాయి. అప్పట్లో బురుజులపై నుండి చుట్టు పక్కల ప్రాంతాలను గమనిస్తూ గ్రామాలను కాపాడే విధంగా ఈ బురుజులను నిర్మించినట్లు చెబుతున్నారు.కాలగమనంలో సరైన సంరక్షణ కరువవ్వడంతో ఈ నిర్మాణాలన్నీ రోజురోజుకు శిధిలావస్థకు చేరుకుంటున్నాయి.కాగ ఈ బురుజులను మరమ్మత్తు చెయ్యడం లేదా ప్రాణదకరంగా ఉన్న భాగాలను తొలగించి ఈ ప్రాంతాలను సురక్షితంగా మార్చాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.చారిత్రక కట్టడాలు భవిషత్తు తరాలకు గ్రామ వారసత్వాన్ని గుర్తుచేసే ప్రతి కలుగా నిలుస్తాయని గ్రామ ప్రజలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.




