Narsapur: రేషన్ బియ్యం అమ్మితే జైలుకే! కలెక్టర్ హెచ్చరిక

Narsapur: నర్సాపూర్ పట్టణంలోని రేషన్ షాపులను అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

G Ashok Reddy, Narsapur
Published on: 12 April 2026 4:18 PM IST
Narsapur
X

Narsapur: రేషన్ బియ్యం అమ్మితే జైలుకే! కలెక్టర్ హెచ్చరిక

Narsapur: నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ చౌకదారుల దుకాణంను ఆదివారము అదనపు కలెక్టర్ నగేష్ తనిఖీ చేశారు. రికార్డులను, బియ్యం విలువలను పరిశీలించి రేషన్ కార్డు దారులతో మాట్లాడారు, కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని డీలర్ కు సూచించారు,పిడిస్ లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రేషన్ షాప్ డీలర్లు సమయపాలన పాటించాలని అన్నారు.

ఎవరైనా రేషన్ బియ్యం కొనడం కానీ అమ్మడం కానీ చేస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.అలాగే మూడు నెలల రేషన్ ఈ నెల 30 తేదీ వరకు ప్రభుత్వం ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story