Addanki Dayakar: అఘోర కాళీపై ప్రమాణం చేసే ధైర్యం ఉందా? హరీష్ రావుకు దయాకర్ సవాల్

Addanki Dayakar: హరీష్ రావు క్షుద్రపూజలపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఆయన పంపిన లీగల్ నోటీసులకు లీగల్‌గానే సమాధానం ఇస్తామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.

Arun Chilukuri
Updated on: 5 Aug 2026 12:11 PM IST
Addanki Dayakar
X

Addanki Dayakar: అఘోర కాళీపై ప్రమాణం చేసే ధైర్యం ఉందా? హరీష్ రావుకు దయాకర్ సవాల్

Addanki Dayakar: మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్రపూజల వ్యవహారంపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హరీష్ రావు పంపిన లీగల్ నోటీసులకు భయపడేది లేదని, ఆయన చేసిన విమర్శలకు లీగల్‌గానే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. హరీష్ రావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, పీసీసీ అధ్యక్షుడితో సహా నిలదీసిన ప్రతి ఒక్కరికీ లీగల్ నోటీసులు పంపడం ఆయన భయానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

అఘోర కాళీ అమ్మవారిపై ప్రమాణం చేసి తాను ఎలాంటి క్షుద్రపూజలు చేయలేదని హరీష్ రావు చెప్పగలరా? అని దయాకర్ సవాల్ విసిరారు. తప్పు ఒప్పుకోకపోతే తెలంగాణ సమాజానికి అఘోర కాళీ దేవాలయం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గతంలో శివమొగ్గకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ ఆఫీసులో పోలీస్ అధికారిగా చెప్పుకొని వెళ్లారని, ఇప్పుడు రెండోసారి క్షుద్రపూజలకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతోనే తాము విషయాలను బయటపెట్టామని తెలిపారు.

తిరుచ్చి అఘోర కాళీ గురించి తాము మాట్లాడుతుంటే ఘట్‌కేసర్ కాళీ ఆలయం అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారని, ఆయనొక పొలిటికల్ కామెడియన్ అని విమర్శించారు. ఆయన వ్యవహారాలపై అమెరికాలో కూడా చర్చ జరుగుతోందన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే కుట్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛిద్రమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆరాటపడుతుంటే... ఆయనకు చెడ్డపేరు రావాలని, వర్షాలు పడకూడదని హరీష్ రావు పిచ్చి పూజలు చేస్తున్నారని ఆరోపించారు.

హరీష్ రావు వ్యవహారం చూస్తుంటే జాలి, సానుభూతి కలుగుతోందని.. కల్వకుంట్ల కుటుంబం ఆయనను ఇప్పటికే పక్కన పెట్టేసిందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్‌కు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story