ACB Raids: అవినీతి తిమింగలం వంశీ మోహన్ గుట్టురట్టు: ముగిసిన ఏసీబీ సోదాలు.. డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్!
ACB Raids: అవినీతి తిమింగలం గుట్టురట్టు! మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. 19 ఇళ్ల స్థలాలు, లగ్జరీ ఫ్లాట్లతో పాటు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని అక్రమంగా కాజేసినట్లు ఏసీబీ గుర్తించింది.
ACB Raids: అవినీతి తిమింగలం వంశీ మోహన్ గుట్టురట్టు: ముగిసిన ఏసీబీ సోదాలు.. డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్!
ACB Raids: రాష్ట్రంలో మరో అవినీతి తిమింగలం గుట్టురట్టయింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు జరిపిన సోదాలు ముగిశాయి. తనిఖీల్లో విస్తుపోయేలా అక్రమ ఆస్తుల చిట్టా వెలుగు చూసింది. సోదాలు పూర్తి కావడంతో ఏసీబీ అధికారులు వంశీ మోహన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని వంశీ మోహన్ భారీగా ల్యాండ్ స్కామ్‌కు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అబ్దుల్లాపూర్‌మెట్, పిగ్లీపురం పరిధిలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని ఆయన అక్రమంగా కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ప్రభుత్వ భూమిని మొదట తన బంధువుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత వాటిని ఒక ప్రముఖ రియల్టర్‌కు బదిలీ చేసినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది.
సోదాల్లో వెలుగుచూసిన ఆస్తుల చిట్టా:
డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో జరిపిన తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన స్థిరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో ఉన్న 19 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు.
వనస్థలిపురం పరిధిలో నిర్మించిన ఒక విలాసవంతమైన ఇల్లు.
నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న లగ్జరీ అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు.
ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ, ఆదాయానికి మించి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన కేసులో వంశీ మోహన్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు. ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.




