Karimnagar: రీయింబర్స్మెంట్ ఎత్తివేతకు కుట్ర.. ఏబీవీపీ ధ్వజం

Karimnagar: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు విమర్శించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 11 April 2026 5:25 PM IST
Karimnagar
X

Karimnagar: రీయింబర్స్మెంట్ ఎత్తివేతకు కుట్ర.. ఏబీవీపీ ధ్వజం

Karimnagar: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం రద్దు చేసే కుట్ర పన్నుతున్న రాష్ట్ర ప్రభుత్వం పై ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,

దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు, ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గర నుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,

ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు. ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలలు ఇంజనీరింగ్, మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.

ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు. విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,

దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని, ఈ విషయాన్ని ప్రభుత్వం, సమాజం అర్థం చేసుకోవాలన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,

మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని, తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు. నా దగ్గర పంచడానికి భూములు లేవు, కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు. విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని, నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని, నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో నాగరాజు, విగ్నేష్, సాయి కృష్ణ, ప్రకాష్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story