Crime News: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులకు విద్యార్థిని బలి

Crime News: హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలో విషాదం. ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య.

AJAY, HAYATH NAGAR
Published on: 10 April 2026 6:04 PM IST
Crime News
X

Crime News: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులకు విద్యార్థిని బలి

Crime News: స్నేహం ముసుగులో తోటి విద్యార్థి చేసిన లైంగిక వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.కుంట్లూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మైనర్ బాలిక మరియు నిందితుడైన బాలుడు ఇద్దరూ పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం ఉండటంతో, దానిని ఆసరాగా చేసుకున్న బాలుడు గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు.

నిందితుడి ప్రవర్తనపై బాలిక మరియు ఆమె కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించినప్పటికీ, అతని తీరులో మార్పు రాలేదు. సరికదా, వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సదరు విద్యార్థిని, గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మృతితో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు,

విషాదంలో మృతదేహాన్ని తీసుకుని వెంటనే తమ స్వగ్రామానికి వెళ్లిపోయారు.విషయం తెలుసుకున్న హయత్ నగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితులు అప్పటికే సాగర్ వైపు వెళ్లడంతో, పోలీసులు వారిని సంప్రదించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరిగి హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి వేధింపుల కోణంలో విచారణ చేపడుతున్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story