Hyderabad Tourist Places: హైదరాబాద్‌లో తప్పక చూడాల్సిన 10 అద్భుత ప్రదేశాలు.. చరిత్ర, ప్రకృతి, ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్!
Must visit places in Hyderabad: కుటుంబం, స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో తప్పక చూడాల్సిన పది అద్భుత ప్రదేశాలు ఏంటో మీకు తెలుసా?
Hyderabad Tourist Places: హైదరాబాద్‌లో తప్పక చూడాల్సిన 10 అద్భుత ప్రదేశాలు.. చరిత్ర, ప్రకృతి, ఆధ్యాత్మికతకు కేరాఫ్ అడ్రస్!
Hyderabad Tourist Places: 'హైదరాబాద్'.. అనగానే చారిత్రక కట్టడాలు, రాజసమైన ప్యాలెస్‌లు, పురాతన మసీదులు, అందమైన సరస్సులు, వినోద ప్రదేశాలు ఒక్కరికి గుర్తుకొస్తాయి. చరిత్రకు ఆధునికతను జోడించుకున్న భాగ్యనగరం.. దేశ, విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కుటుంబం, స్నేహితులతో హైదరాబాద్‌ను సందర్శిస్తే.. తప్పక చూడాల్సిన ఎన్నో అద్భుతమైన అండ్ ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయి. గ్రామాల నుంచి నగరానికి వచ్చే వారు.. హైదరాబాద్‌లోనే ఉండేవారు.. పర్యాటకులు తప్పక సందర్శించాల్సిన 10 ప్రదేశాలు ఏవో ఓసారి చూద్దాం.
1. చారిత్రక ప్రదేశాలు:
చార్మినార్: హైదరాబాద్ నగరానికి ప్రతీకగా నిలిచే చార్మినార్ ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. నాలుగు వైపులా ఎత్తైన మినార్లతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం చుట్టూ ఉన్న పురాతన మార్కెట్లు, సందడిగా ఉండే వీధులు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.
గోల్కొండ కోట: హైదరాబాద్ చరిత్రలో గోల్కొండ కోటకు ప్రత్యేక స్థానం ఉంది. అద్భుతమైన వాస్తు శిల్పంతో పాటు కోటలోని ధ్వని ప్రతిధ్వని ప్రత్యేకత పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సాయంత్రం నిర్వహించే లైట్ అండ్ సౌండ్ షో కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.
చౌమహల్లా ప్యాలెస్: నిజాం పాలన నాటి రాజసాన్ని, వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రదేశం చౌమహల్లా ప్యాలెస్. విశాలమైన ప్రాంగణాలు, అందమైన హాల్స్, రాజభవన నిర్మాణ శైలి చరిత్రపై ఆసక్తి ఉన్నవారిని ఆకట్టుకుంటాయి.
సాలార్ జంగ్ మ్యూజియం: కళాభిమానులు, చరిత్ర ప్రియులకు సాలార్ జంగ్ మ్యూజియం మంచి అనుభూతిని అందిస్తుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పురాతన కళాఖండాలు, శిల్పాలు, వస్తువులు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి.
2. ప్రకృతి, వినోదానికి అనువైన ప్రదేశాలు:
హుస్సేన్ సాగర్ సరస్సు: నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ హైదరాబాద్‌లోని ప్రముఖ విహార ప్రదేశాల్లో ఒకటి. ట్యాంక్ బండ్‌పై సాయంత్రం వేళ విహరిస్తూ సరస్సు అందాలను ఆస్వాదించవచ్చు. బోటింగ్ చేస్తూ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని చూడటం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
రామోజీ ఫిల్మ్ సిటీ: సినిమాలు, వినోద కార్యక్రమాలపై ఆసక్తి ఉన్నవారికి రామోజీ ఫిల్మ్ సిటీ మంచి ప్లేస్. భారీ సెట్స్, గార్డెన్స్, వినోద కార్యక్రమాలు, సినిమా నిర్మాణానికి సంబంధించిన అనుభవాలు ఒకరోజు పర్యటనను ఆసక్తికరంగా మారుస్తాయి.
నెహ్రూ జూలాజికల్ పార్క్: కుటుంబంతో కలిసి సందర్శించేందుకు అడ్డుత ప్రదేశాల్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఒకటి. ఇక్కడ వివిధ రకాల జంతువులు, పక్షులను చూడటంతో పాటు సఫారీ వంటి వినోద కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు.
3. ఆధ్యాత్మిక, పురాతన కట్టడాలు:
బిర్లా మందిర్: నగరంలోని కొండపై తెల్లటి మార్బుల్‌తో నిర్మించిన బిర్లా మందిర్ ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు హైదరాబాద్ నగర దృశ్యాలను కూడా ఇక్కడి నుంచి వీక్షించవచ్చు.
కుతుబ్ షాహి సమాధులు: గోల్కొండను పాలించిన కుతుబ్ షాహి రాజుల సమాధులు చరిత్ర, వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణలు. పురాతన నిర్మాణాలతో పాటు పచ్చని ఉద్యానవనాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
మక్కా మసీదు: చార్మినార్‌కు సమీపంలో ఉన్న మక్కా మసీదు హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక కట్టడాల్లో ఒకటి. విశాలమైన నిర్మాణం, పురాతన వాస్తుశిల్పం కారణంగా ఇది నగరానికి వచ్చే పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది.
4. హైదరాబాద్ ప్రత్యేకత ఏంటంటే?:
చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి గోల్కొండ కోట, చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, కుతుబ్ షాహి సమాధులు మంచి అనుభూతిని అందిస్తాయి. ప్రకృతి, వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి హుస్సేన్ సాగర్, రామోజీ ఫిల్మ్ సిటీ, నెహ్రూ జూలాజికల్ పార్క్ ఆకర్షణీయమైన ఎంపికలు.
ఆధ్యాత్మికత, ప్రశాంతత కోరుకునే వారు బిర్లా మందిర్, మక్కా మసీదును సందర్శించవచ్చు. ఇలా ఒకే నగరంలో చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, వినోదం, ఆధ్యాత్మికతను ఆస్వాదించే అవకాశం హైదరాబాద్ ప్రత్యేకత.




