WhatsApp: కొత్త ఫీచర్ వచ్చేసింది.. వాట్సాప్‌లో యూజర్ నేమ్ పెట్టుకున్నారా?

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'యూజర్‌నేమ్' ఫీచర్‌ ఎట్టకేలకు ఆండ్రాయిడ్, iOS వెర్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

Ravi
By Ravi
Published on: 1 July 2026 10:23 AM IST
WhatsApp
X

WhatsApp: కొత్త ఫీచర్ వచ్చేసింది.. వాట్సాప్‌లో యూజర్ నేమ్ పెట్టుకున్నారా?

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల ప్రైవసీని పెంచేందుకు మరో సరికొత్త అడుగు ముందుకేసింది. ఇతరులకు మన ఫోన్ నంబర్ ఇవ్వకుండానే వారితో చాట్ చేసేందుకు వీలుగా.. ఎంతోకాలంగా ఊరిస్తున్న 'యూజర్‌నేమ్' ఫీచర్‌ను వాట్సాప్ ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ అద్భుతమైన అప్‌డేట్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో యూజర్లకు క్రమంగా అందుబాటులోకి రావడం ప్రారంభమైంది.

ప్రస్తుతం చాలామంది యూజర్లకు వాట్సాప్ యాప్ ఓపెన్ చేయగానే ఈ కొత్త యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకోమని నోటిఫికేషన్ స్క్రీన్ పై కనిపిస్తోంది. ఒకవేళ మీకు అలా నోటిఫికేషన్ రాకపోతే, నేరుగా యాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళితే.. అక్కడ మీకు 'క్రియేట్/రిజర్వ్ యూజర్‌నేమ్' అనే ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఈ ఫీచర్ పూర్తిగా రోల్-అవుట్ కాని ప్రాంతాల్లోని యూజర్లకు 'రిజర్వ్ యూజర్‌నేమ్' అని మాత్రమే ఉంటుంది.

ఈ ఫీచర్ ద్వారా మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ యాప్ సూచించే పేర్లను ఎంచుకోవచ్చు లేదా మీకు నచ్చిన విధంగా ఒక కొత్త పేరును సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా, మీరు ఇప్పటికే ఉపయోగిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ యూజర్‌నేమ్స్‌ను కూడా నేరుగా వాట్సాప్‌ కోసం వాడుకునే ఆప్షన్ ఇందులో ఉండటం విశేషం.

ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే, మున్ముందు మీ పర్సనల్ మొబైల్ నంబర్ ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. కేవలం ఈ యూజర్‌నేమ్ ద్వారానే కాంటాక్ట్ అవ్వొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ వాట్సాప్ అప్‌డేట్ చేసి మీకు నచ్చిన యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోండి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story