WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై చాట్ ఓపెన్ చేయకుండానే పసిగట్టొచ్చు.. అదేంటంటే?
WhatsApp online status update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో విప్లవాత్మక ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఇకపై మీ స్నేహితులు లేదా బంధువులు ఆన్లైన్లో ఉన్నారో లేదో తెలుసుకోవడం చాలా ఈజీ. అది ఎలాగో తెలుసుకుందాం.
whatsapp new feature
WhatsApp online status update: సాధారణంగా ఎవరికైనా అత్యవసరంగా మెసేజ్ చేయాలన్నా లేదా వారు అందుబాటులో ఉన్నారో లేదో చూడాలన్నా, మనం వారి వ్యక్తిగత చాట్ లోపలికి వెళ్లి 'ఆన్లైన్' అని ఉందో లేదో తనిఖీ చేస్తాం. కానీ, ఇకపై ఆ శ్రమ ఉండదు. వాట్సాప్ సెట్టింగ్స్ లేదా కాంటాక్ట్ లిస్ట్ విభాగంలో ఒక ప్రత్యేక సెక్షన్‌ను జోడించబోతోంది. అక్కడ ఆ సమయంలో ఆన్లైన్లో ఉన్న మీ కాంటాక్ట్స్ అందరి జాబితా ఒకేచోట కనిపిస్తుంది. దీనివల్ల పదే పదే వేర్వేరు చాట్లు ఓపెన్ చేసే ఇబ్బంది తప్పుతుంది.
బీటా వెర్షన్లో టెస్టింగ్: ఎలా పనిచేస్తుంది?
వాట్సాప్ అప్డేట్లపై నిఘా ఉంచే 'వాబీటాఇన్ఫో' నివేదిక ప్రకారం, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.13.3 లో ఈ ఫీచర్ ఆనవాళ్లు కనిపించాయి. ప్రస్తుతం డెలప్మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ ద్వారా, యాప్ ఓపెన్ చేయగానే ఎవరు యాక్టివ్‌గా ఉన్నారో సులభంగా గుర్తించవచ్చు. ఇది ముఖ్యంగా తక్షణమే స్పందన కోరుకునే వారికి, గ్రూపుల్లోని సభ్యులతో మాట్లాడాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
గోప్యతకు పెద్దపీట: ప్రైవసీ భద్రమేనా?
ఈ కొత్త ఫీచర్ వల్ల గోప్యతకు భంగం కలుగుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే, వాట్సాప్ దీనిపై స్పష్టతనిచ్చింది. ఎవరైతే తమ 'లాస్ట్ సీన్' లేదా 'ఆన్లైన్ స్టేటస్'ను ఇతరులకు కనిపించకుండా హైడ్ (Hide) చేసుకున్నారో, వారు ఈ కొత్త లిస్టులో కూడా కనిపించరు. అంటే మీరు మీ స్టేటస్‌ను 'నోబడీ' అని సెట్ చేసుకుంటే, మీరు ఆన్లైన్లో ఉన్నట్లు ఎవరికీ తెలియదు. కాబట్టి వినియోగదారుల ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని సంస్థ హామీ ఇస్తోంది.
గ్రూప్ చాట్‌లలోనూ కీలక మార్పులు..
వ్యక్తిగత చాట్లకే పరిమితం కాకుండా, గ్రూప్ చాట్లలో కూడా ఆన్లైన్ ఇండికేటర్‌ను మరింత ఆధునీకరిస్తున్నారు. గ్రూప్ టాప్ బార్లోనే ఎంతమంది సభ్యులు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నారో తెలియజేయడంతో పాటు, వారి పేర్లను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని, త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరికీ స్టేజ్‌ల వారీగా విడుదల చేస్తారని సమాచారం.




