Vivo X500 Pro Max: వీవో X500 ప్రో మాక్స్.. 200MP కెమెరాతో కెమెరా కింగ్.!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వీవో (Vivo) తమ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ సిరీస్ 'వీవో X500' (Vivo X500 Series) ఆవిష్కరణ తేదీని అధికారికంగా ప్రకటించి టెక్ ప్రపంచంలో
Vivo X500 Pro Max
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వీవో (Vivo) తమ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ సిరీస్ 'వీవో X500' (Vivo X500 Series) ఆవిష్కరణ తేదీని అధికారికంగా ప్రకటించి టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెరతీసింది. చైనాలో నిర్వహించిన 'వీవో క్రియేటర్ ఫెస్టివల్' వేదికగా సెప్టెంబర్ 21న ఈ సరికొత్త సిరీస్‌ను మార్కెట్లోకి ఆవిష్కరించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. గతంలో వచ్చిన X400 లైనప్‌లో కంపెనీ కేవలం రెండు మోడళ్లను మాత్రమే మార్కెట్లోకి తీసుకురాగా, ఈసారి వినియోగదారుల విస్తృత అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీవో X500, వీవో X500 ప్రో, , వీవో X500 ప్రో మాక్స్ అనే మూడు భిన్నమైన , అత్యంత శక్తివంతమైన మోడళ్లను రంగంలోకి దించుతోంది.
సినిమాటిక్ స్లో-మోషన్ కెమెరా మ్యాజిక్
కెమెరా సాంకేతికతలో వీవో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈసారి కూడా వీవో X500 ప్రో , X500 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్లలో అందించిన వీడియో రికార్డింగ్ ఫీచర్లు ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్లను సైతం ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ హాన్ బోక్సియావో వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్ఫోన్లలో ఏకంగా 4K/240 fps స్లో-మోషన్ వీడియో రికార్డింగ్‌తో పాటు 4K/120 fps HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను చేర్చారు. వీటికి తోడు వీవో సొంతంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీ సాయంతో ఏకంగా 4K/480 fps , 4K/960 fps నిడివి గల అల్ట్రా స్లో-మోషన్ వీడియోలను ఎంతో స్పష్టతతో రికార్డ్ చేయవచ్చని తెలిపింది. మునుపటి మోడల్స్ కేవలం 4K/120 fps వీడియో రికార్డింగ్కే పరిమితమవ్వగా, ఈ సరికొత్త అప్‌గ్రేడ్ మొబైల్ ఫొటోగ్రఫీ రంగాన్ని మలుపు తిప్పనుంది.
200MP కెమెరా , విప్లవాత్మక జైస్ డిస్ప్లే
ఈ సిరీస్‌లోని అత్యంత ప్రీమియం వేరియంట్ అయిన వీవో X500 ప్రో మాక్స్ కెమెరా , డిస్ప్లే విభాగాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. వెనుక భాగంలో 200-మెగాపిక్సెల్ టెలిఫోటో పెరిస్కోప్ కెమెరాను అందించడం ఈ ఫోన్లోని ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనివల్ల చాలా దూరంలో ఉన్న వస్తువులను కూడా అత్యంత స్పష్టతతో జూమ్ చేసి ఫోటోలు తీయవచ్చు.
ఇక డిస్ప్లే విషయానికొస్తే, ఇది 6.85-అంగుళాల BOE 2K జైస్ మాస్టర్ కలర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అత్యాధునిక Q11 ల్యూమినసెంట్ మెటీరియల్‌తో రూపుదిద్దుకున్న ఈ స్క్రీన్, స్క్రోలింగ్ అనుభవాన్ని ఎంతో స్మూత్‌గా మార్చడమే కాకుండా, పాత జెనరేషన్ BOE Q10 ప్యానెళ్లతో పోలిస్తే మోషన్ బ్లర్‌ను దాదాపు 93 శాతం వరకు తగ్గిస్తుంది. దీనివల్ల గేమింగ్ , వీడియోలు చూసేటప్పుడు కళ్లకు ఎలాంటి అలసట లేకుండా అద్భుతమైన విజువల్స్ లభిస్తాయి.
తిరుగులేని ప్రాసెసింగ్ స్పీడ్
గేమింగ్ , హెవీ మల్టీటాస్కింగ్‌ను తట్టుకునేలా వీవో ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది. గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌పై మోడల్ నంబర్ V2602DA తో ప్రత్యక్షమైన వివరాల ప్రకారం, ఈ ఫ్లాగ్షిప్ మోడల్ మీడియాటెక్ రాబోయే అత్యంత వేగవంతమైన ఆక్టా-కోర్ 'డైమెన్సిటీ 9600 ప్రో' (MediaTek Dimensity 9600 Pro) చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 4.55GHz పీక్ క్లాక్ స్పీడ్ , మాలి-G2-ఆల్ట్రా-NX GPUతో రాబోతున్న ఈ ప్రాసెసర్, ఫోన్ పెర్ఫార్మెన్స్ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్ , క్లాస్-లీడింగ్ కెమెరా ఫీచర్లతో వస్తున్న వీవో X500 సిరీస్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏలడానికి సిద్ధంగా ఉంది.




