Vivo T5 Pro 5G: భారీ బ్యాటరీతో వస్తున్న అతిసన్నని స్మార్ట్‌ఫోన్
Vivo T5 Pro 5G: ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచమే. ఈ స్మార్ట్ ప్రపంచంలో రోజుకో స్మార్ట్‌ఫోన్ విపణిలో విడుదల అవుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి వివో టి5 ప్రో 5 జీ విడుదల కానుంది. భారీ బ్యాటరీ, సన్నని డిజైన్‌తో ఈ ఫోన్ ఇప్పటికే టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
Vivo T5 Pro 5G: భారీ బ్యాటరీతో వస్తున్న అతిసన్నని స్మార్ట్‌ఫోన్
Vivo T5 Pro 5G: ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచమే. ఈ స్మార్ట్ ప్రపంచంలో రోజుకో స్మార్ట్‌ఫోన్ విపణిలో విడుదల అవుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి వివో టి5 ప్రో 5 జీ విడుదల కానుంది. భారీ బ్యాటరీ, సన్నని డిజైన్‌తో ఈ ఫోన్ ఇప్పటికే టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎక్కువసేపు ఫోన్ వాడే యూజర్లకు ఇది మంచి ఎంపికగా ఉండబోతుందని నిపుణులు చెబుతున్నారు.
భారీ బ్యాటరీ సామర్థ్యం
వివో టి 5 ప్రో మొబైల్లో ప్రధాన ఆకర్షణ 9,020mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ. సాధారణంగా స్మార్ట్ఫోన్లలో 5,000mAh బ్యాటరీ ఉంటే సరిపోతుంది. కానీ, ఈ మొబైల్లో 9,000mAh బ్యాటరీతో ఫోన్ రావడం నిజంగా విశేషం. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించే అవకాశం ఉందని అంచనా. అంతేకాదు, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 6.8 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం మరింత స్మూత్‌గా ఉంటుంది. గేమింగ్ ప్రియులకు 120fps వరకు సపోర్ట్ ఇవ్వడం మరో ప్లస్ పాయింట్. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జెన్4 చిప్‌సెట్‌ను అమర్చే అవకాశం ఉంది. రోజువారీ పనులతో పాటు హెవీ యాప్స్, గేమ్స్ కూడా సులభంగా నిర్వహించగల సామర్థ్యం ఈ ఫోన్లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేయనుంది.
డిజైన్ లుక్
వివో T5 ప్రో 5G సన్నగా, స్టైలిష్‌గా కనిపించనుంది. పిల్-షేప్ డ్యూయల్ కెమెరా మాడ్యూల్తో పాటు కాస్మిక్ బ్లాక్, గ్లాసియర్ బ్లూ రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్స్ ఉండే అవకాశముంది. అయితే, కంపెనీ దీనికి సంబంధించిన కెమెరా వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మంచి ఫొటోగ్రఫి అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ సంకేతాలు ఇస్తోంది. సోషల్ మీడియా వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ధర విషయానికి వస్తే, రూ.30,000 నుంచి రూ.35,000 మధ్య ఈ ఫోన్ ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు రావడం వినియోగదారులకు మంచి డీల్‌గా భావిస్తున్నారు.




