Spark Station : వీడియో క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ‘స్పార్క్ స్టేషన్’ వచ్చేసింది.!
Spark Station : మీరు సినిమాలు, ప్రకటనలు, లేదా బ్రాండ్ వీడియోలు తయారు చేస్తున్నారా? లేదా తక్కువ టైమ్‌లో హై-క్వాలిటీ ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేట్
Spark-Station
Spark Station : మీరు సినిమాలు, ప్రకటనలు, లేదా బ్రాండ్ వీడియోలు తయారు చేస్తున్నారా? లేదా తక్కువ టైమ్‌లో హై-క్వాలిటీ ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్న ఇన్‌ఫ్లుయెన్సరా? అయితే మీ పనిని మరింత ఈజీ చేయడానికి మార్కెట్‌లోకి ఒక అద్భుతమైన ఏఐ ప్లాట్‌ఫామ్ వచ్చింది. కంటెంట్ క్రియేషన్ కోసం వేర్వేరు ఏఐ టూల్స్ వాడే శ్రమను తగ్గించేలా 'వెర్స్ ఇన్నోవేషన్స్' సంస్థ 'ఫిల్మ్ ఎక్స్‌పో 2026' వేదికగా ‘స్పార్క్ స్టేషన్’ (Spark Station) అనే సరికొత్త ఆల్-ఇన్-వన్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా పరిచయం చేసింది.
స్క్రిప్ట్ నుంచి ఫైనల్ వీడియో వరకు అన్నీ ఒకే చోట
స్పార్క్ స్టేషన్ అనేది కేవలం ఒక సాధారణ ఏఐ వీడియో జనరేటర్ మాత్రమే కాదు. ఒక ఐడియా ఆలోచించినప్పటి నుంచి ఫైనల్ వీడియో బయటకు వచ్చేంత వరకు ప్రొడక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని ఒకే వర్క్‌ఫ్లో కిందకి తీసుకొస్తుంది. స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీబోర్డ్, క్యాస్టింగ్, కాస్ట్యూమ్స్, కెమెరా యాంగిల్స్, లొకేషన్ ప్లానింగ్ మాత్రమే కాకుండా మ్యూజిక్, డైలాగ్స్, ఎడిటింగ్, క్యాప్షన్లు , రెండరింగ్ వరకు అన్ని పనులను ఈ ఒకే ప్లాట్‌ఫామ్‌లో పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల వేర్వేరు పనుల కోసం రకరకాల ఏఐ యాప్స్ వాడాల్సిన అవసరం ఉండదు.
90 శాతం ప్రొడక్షన్ కాస్ట్ ఆదా..
ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి కంపెనీ చెబుతున్న ప్రధాన ఆకర్షణ దీని స్పీడ్ , తక్కువ ఖర్చు. సాధారణంగా ఒక 60 సెకన్ల బ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్ వీడియో షూట్ చేయడానికి దాదాపు 10 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ స్పార్క్ స్టేషన్ ఉపయోగించి అదే క్వాలిటీ వీడియోను కేవలం 50,000 నుంచి 75,000 రూపాయల బడ్జెట్‌లోనే పూర్తి చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ ఏకంగా 90 శాతం వరకు తగ్గుతుంది.
పాత్రలు, లొకేషన్లలో మెరుగైన కన్సిస్టెన్సీ
సాధారణంగా ఏఐ వీడియోలు చేసేటప్పుడు ఒక షాట్‌కు, మరో షాట్‌కు క్యారెక్టర్ ముఖం, డ్రెస్ లేదా లొకేషన్ మారిపోయే ప్రాబ్లమ్ ఉంటుంది. స్పార్క్ స్టేషన్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొంది. వీడియోలో ప్రతీ సీన్‌లోనూ క్యారెక్టర్స్ ఫేస్ కట్స్, ఎక్స్‌ప్రెషన్స్, డ్రెస్సులు , లొకేషన్ వివరాలు మారకుండా మెయింటెన్ అయ్యేలా ఈ టూల్‌ను డిజైన్ చేశారు. దీనివల్ల వీడియో నిజమైన సినిమా లాగా చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తుంది.
మల్టీ-మోడల్ అప్రోచ్.. 60కి పైగా లాంగ్వేజెస్
ఈ ప్లాట్‌ఫామ్ కేవలం ఒకే ఏఐ మోడల్‌పై డిపెండ్ అవ్వకుండా 'మల్టీ-మోడల్' టెక్నాలజీని వాడుతుంది. అంటే వర్క్‌ను బట్టి అత్యుత్తమ ఫలితాన్ని ఇచ్చే సరికొత్త ఏఐ మోడల్‌ను సిస్టమే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకుంటుంది. అంతేకాకుండా, భారతదేశం లాంటి వైవిధ్యమైన మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రాపర్ లిప్-సింక్ , లోకల్ యాసలకు సపోర్ట్ చేస్తూ ఏకంగా 60కి పైగా భాషల్లో కంటెంట్ క్రియేట్ చేసే కెపాసిటీని దీనికి అందించారు.
ఎవరెవరికి ఉపయోగపడుతుంది? యూజర్లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?
ఈ ప్లాట్‌ఫామ్ ఫిల్మ్ మేకర్స్, ప్రొడక్షన్ హౌసెస్, బ్రాండ్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలతో పాటు ఇండివిజువల్ కంటెంట్ క్రియేటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్‌ను పాపులర్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లకు ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ స్పార్క్ స్టేషన్ బీటా వెర్షన్ ఆగస్టు 29 నుంచి అందుబాటులోకి రాగా, అక్టోబర్ 1 నుంచి యూజర్లందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అలాగే ఎంటర్‌ప్రైజ్ ఏపీఐ (Enterprise API) సేవలు నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి.




