September Smartphone Launches: సెప్టెంబర్‌లో ఫోన్ల జాతర.. ఐఫోన్ 18 నుంచి షియోమీ 18 వరకు..!
September Smartphone Launches: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు సెప్టెంబర్ 2026 నెల అత్యంత ఉత్సాహభరితంగా మారబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్లు తమ సరికొత్త
September Smartphone Launches:
September Smartphone Launches: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు సెప్టెంబర్ 2026 నెల అత్యంత ఉత్సాహభరితంగా మారబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్లు తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆపిల్ నుంచి వివో, ఇన్ఫినిక్స్, పోకో, రెడ్‌మీ, ఐకూ , షియోమీ వరకు ప్రతి ప్రముఖ బ్రాండ్ తమ కొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందించాయి. వీటిలో కొన్ని నేరుగా భారత మార్కెట్లో అడుగుపెడుతుండగా, మరికొన్ని ముందుగా చైనా , ఇతర గ్లోబల్ మార్కెట్లలో విడుదల కానున్నాయి.
వివో T5 5G , ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G+
సెప్టెంబర్ మొదట్లోనే భారత మార్కెట్లో వివో తన T5 5G స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 2న లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ 6.83-అంగుళాల 1.5K 3D కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌తో రానుంది. కేవలం 7.9mm సన్నని బాడీ కలిగిన ఈ డివైజ్‌లో ఏకంగా 7,050mAh బ్యాటరీని అమర్చడం విశేషం. దీనికి పోటీగా ఇన్ఫినిక్స్ సంస్థ 'హాట్ 70 ప్రో 5G+' మోడల్‌ను సెప్టెంబర్ 4న భారత విపణిలో ఆవిష్కరించనుంది. ఈ ఫోన్‌లో 6.76-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ డిస్‌ప్లే, వెనుక భాగంలో ఇంటరాక్టివ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్ డిజైన్, , 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 6,000mAh బ్యాటరీ రానున్నాయి.
పోకో F9 ప్రో , F9 అల్ట్రా
గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని పోకో సంస్థ తన F9 ప్రో , F9 అల్ట్రా హ్యాండ్‌సెట్‌లను సెప్టెంబర్ 1న పరిచయం చేస్తోంది. ఈ రెండు ఫోన్లు అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. వీటిలో 185Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందించే అమోలెడ్ డిస్‌ప్లేలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్ , గరిష్టంగా 8,050mAh వరకు సామర్థ్యం గల పెద్ద బ్యాటరీలు ఉండే అవకాశం ఉంది. అల్ట్రా మోడల్‌లో 5x పెరిస్కోప్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ , ఫోల్డబుల్ 'ఐఫోన్ అల్ట్రా'
ఆపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాన్యువల్ ఈవెంట్ సెప్టెంబర్ 9న జరిగే అవకాశం ఉంది. ఈ వేదికపై ఐఫోన్ 18 ప్రో , ప్రో మ్యాక్స్ మోడళ్లను ఆపిల్ ప్రదర్శించనుంది. ఇవి TSMC 2nm ప్రాసెస్‌పై తయారైన A20 ప్రో చిప్‌సెట్‌తో రానున్నాయి. వీటిలో వేరియబుల్ అపెర్చర్ కలిగిన మెయిన్ కెమెరా, బ్రైటర్ టెలిఫోటో లెన్స్ , చిన్నదిగా మారిన డైనమిక్ ఐలాండ్ ఉండనున్నాయి.
దీంతో పాటుగా, ఆపిల్ చరిత్రలోనే మొదటిసారిగా తయారు చేసిన ఫోల్డబుల్ మోడల్ 'ఐఫోన్ అల్ట్రా'ను కూడా ఇదే వేదికపై ఆవిష్కరించవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్‌లు భారత్‌తో సహా ఇతర మార్కెట్లలో సెప్టెంబర్ 18 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 17 ప్రో సిరీస్ , ఐకూ 16
భారత్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన రెడ్‌మీ నోట్ సిరీస్‌లో 'నోట్ 17 ప్రో' , 'నోట్ 17 ప్రో మ్యాక్స్' మోడళ్లు సెప్టెంబర్ 15న ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రో మ్యాక్స్ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు ఏకంగా 10,000mAh బ్యాటరీ , 100W ఛార్జింగ్‌ను అందించనున్నారు. మరోవైపు, ఐకూ తన కొత్త ఫ్లాగ్‌షిప్ 'ఐకూ 16'ను సెప్టెంబర్‌లో చైనాలో విడుదల చేయనుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్, 2K LTPO అమోలెడ్ స్క్రీన్, ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ , 100W కంటే ఎక్కువ వేగంతో ఛార్జ్ అయ్యే బ్యాటరీ ఉండనున్నాయి.
వివో X500 సిరీస్ , షియోమీ 18 ఫ్లాగ్‌షిప్స్
కెమెరా సాంకేతికతకు పేరుగాంచిన వివో, తన ప్రిమియం 'X500' సిరీస్‌ను (X500, ప్రో, ప్రో మ్యాక్స్) చైనాలో ఆవిష్కరించనుంది. జైస్ (Zeiss) భాగస్వామ్యంతో వస్తున్న ఈ ఫోన్లలో 200MP సూపర్ టెలిఫోటో కెమెరా , అడ్వాన్స్‌డ్ CIPA 7.0 స్టెబిలైజేషన్ సిస్టమ్ ఉండనుంది. ఇక సెప్టెంబర్ చివరి వారంలో షియోమీ తన '18 ప్రో' , '18 ఫోల్డ్' మోడళ్లను చైనాలో లాంచ్ చేయనుంది. షియోమీ 18 ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్‌తో రాబోతున్న మొదటి స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది. మొత్తానికి సెప్టెంబర్ నెల స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు సరికొత్త టెక్నాలజీ అనుభూతిని అందించబోతోంది.




