Samsung Galaxy Tab S12+ : శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్ లీక్..

Samsung Galaxy Tab S12+ : టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ట్యాబ్లెట్ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా

G Krishna
Published on: 12 July 2026 1:07 PM IST
samsung-galaxy-tab-s12-plus
X

samsung-galaxy-tab-s12-plus

Samsung Galaxy Tab S12+ : టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ట్యాబ్లెట్ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 'శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+' ఫస్ట్ లుక్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ కొత్త ట్యాబ్లెట్ ఫ్రంట్ డిజైన్‌తో పాటు కొన్ని క్రేజీ ఫీచర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ సిరీస్‌లో గెలాక్సీ ట్యాబ్ S12+ మోడల్‌తో పాటు మరింత అడ్వాన్స్‌డ్ వెర్షన్ అయిన 'గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా'ను కూడా కంపెనీ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.

మోడల్ నంబర్లు.. సేఫ్టీ సర్టిఫికేషన్స్

ఆన్‌లైన్ లీక్స్ ప్రకారం.. గెలాక్సీ ట్యాబ్ S12+ వై-ఫై (Wi-Fi) వేరియంట్ SM-X840 మోడల్ నంబర్‌తో రానుంది. అలాగే 5G వేరియంట్ SM-X846N మోడల్ నంబర్‌తో వస్తోంది. ఈ రెండు మోడళ్లు ఇప్పటికే దక్షిణ కొరియాలో సేఫ్టీ సర్టిఫికేషన్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

బిగ్ డిస్‌ప్లే.. బెజెల్‌లోనే కెమెరా

లీక్ అయిన ఫొ nటోలను గమనిస్తే.. గెలాక్సీ ట్యాబ్ S12+లో ఫ్రంట్ కెమెరాను డిస్‌ప్లే బెజెల్‌లోనే సెట్ చేశారు. అయితే ఈ కెమెరా రిజల్యూషన్ ఎంత అనే డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. ఇందులో ఏకంగా 14.6 అంగుళాల భారీ స్క్రీన్‌ను అందించబోతున్నారట. ఇంత పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల సినిమా లవర్స్‌కు, గేమర్స్‌కు, ఆఫీస్ పనులు చేసుకునే ప్రొఫెషనల్స్‌కు ఈ ట్యాబ్లెట్ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్.. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్

ఈ ట్యాబ్లెట్ పర్ఫార్మెన్స్ విషయంలో శామ్‌సంగ్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇందులో అత్యంత శక్తివంతమైన 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 (MediaTek Dimensity 9500) ఆక్టా-కోర్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను వాడబోతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ట్యాబ్లెట్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది.

ఛార్జింగ్ టెన్షన్ లేని భారీ బ్యాటరీ

పెద్ద డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉన్నప్పుడు బ్యాటరీ కూడా అంతే బలంగా ఉండాలి కదా.. అందుకే ఈ ట్యాబ్లెట్‌లో ఏకంగా 11,600mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇస్తున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి. దీనివల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ సేపు వస్తుంది.

లాంచ్ ఎప్పుడు ఉండొచ్చు.?

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం.. శామ్‌సంగ్ ఈ గెలాక్సీ ట్యాబ్ S12+ను ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి అఫీషియల్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే అక్టోబర్ నెలలో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ S26 FE' మోడల్‌ను కూడా కంపెనీ పరిచయం చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వివరాలన్నింటిపై శామ్‌సంగ్ కంపెనీ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి కంపెనీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వీటిని కేవలం లీకులు లేదా పుకార్లుగానే భావించాల్సి ఉంటుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story