Redmi 15A 5G: భారీ డిస్‌ప్లే, పవర్ ఫుల్ బ్యాటరీతో వచ్చేసిన రెడ్ మీ 15 ఏ.. తడి చేతులతోనూ వాడొచ్చు..!

Redmi 15A 5G: భారతీయ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమీ మరోసారి సంచలనం సృష్టించింది. తన పాపులర్ ఏ-సిరీస్‌ను విస్తరిస్తూ సరికొత్త 'రెడ్‌మీ 15ఏ 5జీ'ని మార్కెట్లోకి విడుదల చేసింది.

Venkat
Published on: 27 March 2026 8:22 PM IST
Redmi 15A 5G launch price in India
X

Redmi 15A 5G

Redmi 15A 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ, భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా 'ద రియల్ హీరో' అనే నినాదంతో రెడ్‌మీ 15ఏ 5జీని పరిచయం చేసింది. తక్కువ ధరలో 5జీ వేగంతో పాటు, సుదీర్ఘ కాలం మన్నే బ్యాటరీ కావాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3.0తో పనిచేయడం విశేషం.

తడి స్క్రీన్‌పై కూడా పనిచేసే సాంకేతికత..

ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇందులో అమర్చిన 'వెట్ టచ్ టెక్నాలజీ 2.0' వల్ల స్క్రీన్ తడిగా ఉన్నప్పుడు లేదా చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఫోన్‌ను వాడుకోవచ్చు. వర్షాకాలంలో లేదా వంట గదిలో పని చేసేటప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్..

బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 6300 ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు 15 వాట్ల వైర్డ్ ఛార్జింగ్, ఇతర పరికరాలను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 7.5 వాట్ల రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

కెమెరాతోపాటు మరిన్ని ఫీచర్లు..

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 32 మెగాపిక్సెల్ కృత్రిమ మేధస్సుతో కూడిన రెండు కెమెరాలు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్లో 2 టీబీ వరకు మెమరీని పెంచుకునే సదుపాయం కూడా కలదు. అంతేకాకుండా, కంపెనీ ఈ ఫోన్ కోసం 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 6 ఏళ్ల భద్రతా అప్‌డేట్లను ఇస్తామని హామీ ఇచ్చింది.

ధర, లభ్యత..

భారతదేశంలో ఈ ఫోన్ మూడు రకాల్లో అందుబాటులో ఉంది:

4జీబీ + 64జీబీ వేరియంట్ ధర: రూ. 12,999

4జీబీ + 128జీబీ వేరియంట్ ధర: రూ. 14,499

6జీబీ + 128జీబీ వేరియంట్ ధర: రూ. 16,499

ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 3, 2026 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు, షావోమీ అధికారిక కేంద్రాల్లో లభిస్తుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story