Realme C100i : రూ.14,999కే 6,500mAh బ్యాటరీ.. రియల్‌మీ C100i దుమ్మురేపే ఎంట్రీ.!

Realme C100i : పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఇండియన్ మొబైల్ మార్కెట్‌లోకి తమ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘Realme C100i’ ని అధికారికంగా..

G Krishna
Published on: 27 Aug 2026 1:40 PM IST
Realme C100i : రూ.14,999కే 6,500mAh బ్యాటరీ.. రియల్‌మీ C100i దుమ్మురేపే ఎంట్రీ.!
X

realme-c100i

Realme C100i : పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఇండియన్ మొబైల్ మార్కెట్‌లోకి తమ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘Realme C100i’ ని అధికారికంగా రిలీజ్ చేసింది. తమ పాపులర్ ‘సి’ (C) సిరీస్‌లో భాగం అందించిన ఈ ఫోన్, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే యూజర్ల కోసం సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. పవర్‌ఫుల్ బ్యాటరీ, మోడర్న్ డిస్‌ప్లే, వాటర్ రెసిస్టెన్స్ బాడీతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి.

ప్రైసింగ్, అవైలబిలిటీ , కలర్ ఆప్షన్స్

ఇండియన్ మార్కెట్‌లో Realme C100i స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ , 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్‌ను రూ. 14,999గా ఫిక్స్ చేశారు. స్పెషల్ ఆఫర్‌ కింద అర్హులైన స్టూడెంట్స్ కోసం రూ. 250 కూపన్ డిస్కౌంట్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తో పాటు రియల్‌మీ ఇండియా అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా సేల్‌కి అందుబాటులో ఉంది. యూజర్లు తమకి నచ్చినట్లు ఎంచుకోవడానికి మిడ్‌నైట్ బ్లాక్, స్కైలైన్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది.

స్మూత్ 120Hz డిస్‌ప్లే , డ్యూరబిలిటీ

ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ (Realme UI) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులోని 6.75 ఇంచుల హెచ్‌డీ+ (720x1570 పిక్సెల్స్) ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 100% sRGB కలర్స్ , 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లేకి స్క్రాచెస్ పడకుండా పాండా MN228 గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఉపయోగించారు. అంతేకాకుండా, వాటర్ స్ప్లాషెస్ , డస్ట్ నుంచి ఫోన్‌ను కాపాడటానికి ఈ బడ్జెట్ ఫోన్‌కు IP64 రేటింగ్ , ఆర్మోర్‌షెల్ (ArmorShell) ప్రొటెక్షన్ బాడీని అందించడం ఒక స్పెషల్ హైలైట్.

ప్రాసెసర్ , స్టోరేజ్ పెర్ఫార్మెన్స్

Realme C100i స్మార్ట్‌ఫోన్‌లో అక్టా-కోర్ యూనిసోక్ T7250 (Unisoc T7250) ప్రొసెసర్‌ను అమర్చారు. ఇది 1.8GHz గరిష్ట క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. గ్రాఫిక్స్ హెవీ టాస్క్‌ల కోసం ARM Mali-G57 జీపీయూని ఇందులో చేర్చారు. మొబైల్‌లో 4GB LPDDR4x ర్యామ్ , 64GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. ఒకవేళ మరింత స్టోరేజ్ కావాలనుకునే యూజర్లు మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా మెమరీని పెంచుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఫోన్ అన్‌లాక్ , ప్రైవసీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను నిక్షిప్తం చేశారు.

క్యాజువల్ కెమెరాలు, 6,500mAh జంబో బ్యాటరీ

కెమెరా విషయానికి వస్తే, ఫోన్ వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ సింగిల్ ఆటోఫోకస్ కెమెరాను, సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను ఆఫర్ చేస్తున్నారు. ఈ కెమెరా సెటప్‌తో 1080p క్వాలిటీతో ఫుల్ హెచ్‌డీ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఈ మొబైల్‌లో మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఏంటంటే దీని 6,500mAh భారీ బ్యాటరీ. ఇది 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రోజువారీ యూసేజ్‌లో లాంగ్ బ్యాటరీ లైఫ్ ఆశిస్తున్న వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. కనెక్టివిటీ కోసం 4G LTE, వై-ఫై 5, బ్లూటూత్ 5.2, టైప్-సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి అన్ని బేసిక్ సపోర్ట్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ బరువు దాదాపు 210 గ్రాములు ఉంటుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story