Poco X8 Power : 10,000mAh బ్యాటరీతో పోకో X8..!
Poco X8 Power : పోకో ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన నెక్స్ట్ జనరేషన్ 'పోకో X8' సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
Poco X8 Power
Poco X8 Power : పోకో ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన నెక్స్ట్ జనరేషన్ 'పోకో X8' సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వచ్చే వారంలోనే ఈ కొత్త సిరీస్ ఇండియన్ మార్కెట్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ లైనప్‌లో భాగంగా ‘పోకో X8’ (Poco X8) , అత్యంత శక్తివంతమైన ‘పోకో X8 పవర్’ (Poco X8 Power) అనే రెండు మోడళ్లను కంపెనీ పరిచయం చేయనుంది. డిస్ప్లే క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ , బిల్డ్ క్వాలిటీలో గత మోడళ్ల కంటే గణనీయమైన అప్‌గ్రేడ్స్‌తో ఇవి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్లు మార్కెట్లోకి రాకముందే వాటికి సంబంధించిన లీక్డ్ స్పెసిఫికేషన్లు, లాంచ్ డేట్ , ప్రైస్ డీటైల్స్ బయటకు వచ్చాయి.
లాంచ్ డేట్, సేల్ , అంచనా ధర వివరాలు
తాజా నివేదికల ప్రకారం, పోకో X8 సిరీస్ సెప్టెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 12:00 గంటలకు భారతదేశంలో అధికారికంగా లాంచ్ కానుంది. మార్కెట్లోకి విడుదలైన తర్వాత ఈ రెండు స్మార్ట్ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ధరల విషయానికి వస్తే, బేస్ మోడల్ అయిన పోకో X8 ధర రూ. 28,000 నుంచి రూ. 30,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇక హై-ఎండ్ మోడల్ అయిన పోకో X8 పవర్ ధర సుమారు రూ. 35,000 వరకు ఉండవచ్చని సమాచారం.
పోకో X8 లీక్డ్ స్పెసిఫికేషన్లు
లీక్ అయిన డీటైల్స్ ప్రకారం, పోకో X8 ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.83-అంగుళాల 1.5K LTPS OLED డిస్ప్లేను అందించనున్నారు. ఇది గేమింగ్ , వీడియో వాచింగ్ సమయంలో స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఈ హ్యాండ్సెట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని, దీనికి ఎల్ పీ డీ డీ ఆర్ 4ఎక్స్ ర్యామ్ , యుఎఫ్ ఎస్ 3.1 స్టోరేజ్ జతచేశారని తెలుస్తోంది. కెమెరా విభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయి. అంతేకాకుండా ఈ మోడల్లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 9,000mAh బ్యాటరీని అందించడం విశేషం.
పోకో X8 పవర్.. పవర్ ఫుల్ హార్డ్‌వేర్ , భారీ బ్యాటరీ!
స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే పోకో X8 పవర్ వేరియంట్లో పవర్ఫుల్ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో రానుండగా, వేగవంతమైన పెర్ఫార్మెన్స్ కోసం ఎల్ పీ డీ డీ ఆర్ 5ఎక్స్ ర్యామ్, యుఎఫ్ ఎస్ 4.1 స్టోరేజ్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ దీని బ్యాటరీనే అని చెప్పాలి. ఏకంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఏకంగా 10,000mAh రాక్షస బ్యాటరీని ఈ ఫోన్లో అమర్చినట్లు సమాచారం. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా , ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరాను అందించనున్నారు.




