Poco F9 : పోకో F9 సిరీస్ ఎంట్రీ.. స్నాప్‌డ్రాగన్ పవర్‌తో దుమ్మురేపనుంది.!
Poco F9 : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు త్వరలోనే ఒక మంచి తీపి కబురు అందబోతోంది. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘F9’ సిరీస్
Poco-F9
Poco F9 : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు త్వరలోనే ఒక మంచి తీపి కబురు అందబోతోంది. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘F9’ సిరీస్ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. షియోమి సబ్-బ్రాండ్ అయిన పోకో నుంచి రాబోతున్న పోకో ఎఫ్9 ప్రో, పోకో ఎఫ్9 ఆల్ట్రా మోడళ్లు త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లో సందడి చేయనున్నాయి. ఈ రెండు ఫోన్ల రాక గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, అంతర్జాతీయంగా పలు ప్రముఖ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో ఇవి ప్రత్యక్షం కావడంతో లాంచ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని స్పష్టమవుతోంది.
అంతర్జాతీయ సర్టిఫికేషన్ సైట్లలో ప్రత్యక్షం
సాంకేతిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు గ్లోబల్ మొబైల్ డేటాబేస్ అయిన జిఎస్ఎమ్ఏ ఐఎమ్ఈఐ ల్యాండ్‌స్కేప్‌లో నమోదయ్యాయి. పోకో ఎఫ్9 ప్రో మోడల్ నంబర్ 2607APCA5Gతో నమోదవగా, పోకో ఎఫ్9 ఆల్ట్రా మోడల్ నంబర్ 26077PC53Gతో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇవి కంపెనీ అంతర్గత పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ఐఎమ్ఈఐ మాత్రమే కాకుండా, సింగపూర్ ఐఎమ్‌డీఏ, ఇండోనేషియా టీకేడీఎన్ , ఎస్‌డీపీపీఐ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇవి అనుమతులు పొందాయి. షియోమి ఎలక్ట్రానిక్స్ పేరుతో నమోదు అయిన ఈ ఫోన్‌లలో 5జీ సపోర్ట్‌తో పాటు బ్లూటూత్, వైఫై, ఎన్ఎఫ్సి వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఊహించని రేంజ్ ప్రాసెసర్లు.. అదిరిపోయే పెర్ఫార్మెన్స్
గత ఏడాది లాంచ్ అయిన పోకో ఎఫ్8 ఆల్ట్రా, పోకో ఎఫ్8 ప్రో ఫోన్లకు ఇవి వరుసగా తదుపరి మోడల్స్‌గా రానున్నాయి. లీకైన నివేదికల ప్రకారం, పోకో ఎఫ్9 సిరీస్ ఫోన్లలో క్వాల్కమ్ టాప్-ఎండ్ ప్రాసెసర్లను ఉపయోగించనున్నారు. పోకో ఎఫ్9 ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. అదేవిధంగా పోకో ఎఫ్9 ఆల్ట్రా అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత మోడల్ అయిన పోకో ఎఫ్8 ఆల్ట్రాలో 6,500mAh బ్యాటరీని, ఎఫ్8 ప్రోలో 6,210mAh బ్యాటరీని అందించిన సంగతి తెలిసిందే. ఈసారి కొత్త F9 సిరీస్‌లో మరింత మెరుగైన బ్యాటరీ సామర్థ్యంతో పాటు వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాన్ని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీవో X500 గ్లోబల్ వేరియంట్ కూడా సిద్ధమే
పోకోతో పాటు మరో ప్రముఖ చైనా దిగ్గజం వీవో కూడా తన నయా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టెక్ టిప్‌స్టర్ అన్విన్ ఇచ్చిన వివరాల ప్రకారం, వీవో X500 గ్లోబల్ వేరియంట్ (మోడల్ నంబర్ V2619 / V2610) ఇండోనేషియా ఎస్‌డీపీపీఐ , టీకేడీఎన్ సర్టిఫికేషన్ సాధించింది. అయితే.. ఈ సర్టిఫికేషన్ సైట్లలో ఫోన్ స్పెసిఫికేషన్లు పూర్తిస్థాయిలో వెల్లడికాకపోయినప్పటికీ, చైనాలో సెప్టెంబర్‌లో అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని వారాల్లోనే ఇది అంతర్జాతీయ మార్కెట్‌లోకి కూడా రానుందని తెలుస్తోంది.
ఎప్పుడు లాంచ్ కావచ్చు.?
పోకో గతంలో తన F-సిరీస్ మోడళ్లను అక్టోబర్‌లో సర్టిఫై చేసి నవంబర్‌లో మార్కెట్‌లోకి తెచ్చేది. అయితే ఈసారి జులైలోనే అన్ని సర్టిఫికేషన్లు పూర్తవుతుండటంతో, నిర్ణీత సమయం కంటే ముందే.. అంటే అక్టోబర్ నాటికే పోకో F9 ప్రో, F9 ఆల్ట్రా ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రీమియం ఫీచర్లు, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లతో రానున్న ఈ ఫోన్లు యూరోప్, ఇండోనేషియా, తైవాన్, రష్యా, జపాన్ వంటి అనేక దేశాల మార్కెట్లలో గట్టి పోటీని ఇవ్వనున్నాయి.




