ఇకపై ఫోన్ ఎంత వాడినా కళ్లకు అలసట ఉండదు.. అదిరిపోయే ఫీచర్‌తో రానున్న ఒప్పో కొత్త ఫోన్..!
Oppo Find X10 Eye Protection Display: మొత్తం మీద ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో డిస్‌ప్లే టెక్నాలజీ పరంగా కొత్త ప్రమాణాలను సృష్టించనుంది.
ఇకపై ఫోన్ ఎంత వాడినా కళ్లకు అలసట ఉండదు.. అదిరిపోయే ఫీచర్‌తో రానున్న ఒప్పో కొత్త ఫోన్..!
Oppo Find X10 Eye Protection Display: కొత్త స్మార్ట్‌ఫోన్ల కోసం ఎదురుచూసే టెక్ ప్రియులకు ఓ గుడ్‌న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో త్వరలో 'ఫైండ్ ఎక్స్10' సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో కంటికి హాని చేయని సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీని వాడుతున్నట్లు తాజా లీక్‌ల ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్‌లో డిస్‌ప్లే నాణ్యతతో పాటు వినియోగదారుల కంటి భద్రతకు కంపెనీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త ఫోన్ కోసం ప్రత్యేకమైన ఐ-ప్రొటెక్షన్ డిస్‌ప్లే సబ్‌స్ట్రేట్‌ను ఒప్పో స్వయంగా అభివృద్ధి చేస్తోంది. ఈ సరికొత్త ప్యానెల్ BT.2020 కలర్ గామట్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో విస్తృతంగా వాడుతున్న DCI-P3 స్టాండర్డ్ కంటే ఇది ఎంతో మెరుగైన రంగులను అందిస్తుంది. ఇందులో ప్రమాదకరమైన బ్లూ లైట్ ఉద్గారాలను భారీగా తగ్గించారు. కంటికి మేలు చేసే రెడ్ లైట్ శాతాన్ని పెంచారు. దీనివల్ల స్క్రీన్ రంగులు చాలా సహజంగా, స్పష్టంగా కనిపించడంతో పాటు, గంటల తరబడి ఫోన్ వాడినా కళ్లపై ఎలాంటి ఒత్తిడి పడదు.
అద్భుతమైన ఫీచర్లు.. పవర్‌ఫుల్ ప్రాసెసర్..
స్టాండర్డ్ ఫైండ్ ఎక్స్10 మోడల్‌లో స్లిమ్ బెజెల్స్‌తో కూడిన 6.59-అంగుళాల 1.5K డిస్‌ప్లేను అందించనున్నారు. అంచుల మందాన్ని తగ్గించేందుకు ఒప్పో కొత్త డ్యూయల్-స్క్రీన్ ప్రొడక్షన్ లైన్లను ఉపయోగిస్తోంది. ఇక పనితీరు విషయానికి వస్తే.. ఇందులో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 లైట్ ప్రాసెసర్‌ను వాడే అవకాశం ఉంది. ఇది డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్. గతంలో వచ్చిన ఫైండ్ ఎక్స్9 మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ లాంటి ఫీచర్లు ఉండేవి. రాబోయే ఎక్స్10 సిరీస్‌లో వీటికి మించిన అత్యాధునిక హార్డ్‌వేర్ ఉండబోతోందని స్పష్టమవుతోంది.
200MP కెమెరాతో లాంచ్ ఎప్పుడంటే?
ఈ సిరీస్ ఫోన్లలో కెమెరా పనితీరు కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఏకంగా 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించనున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి. అంతా సవ్యంగా జరిగితే సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్ ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇతర మొబైల్ బ్రాండ్లు కూడా ఇలాంటి డిస్‌ప్లే టెక్నాలజీపై పనిచేస్తున్నప్పటికీ, అవి వచ్చే ఏడాది వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.




