8000mAh బ్యాటరీ, సూపర్ లుక్స్‌తో Oppo A7 Pro.. లాంచ్ డేట్ ఫిక్స్..!
స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్! పాపులర్ బ్రాండ్ Oppo నుంచి మరో క్రేజీ మోడల్ రాబోతోంది. కంపెనీ 'Oppo A7 Pro' లాంచ్ డేట్‌ను అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ కొత్త
Oppo A7 Pro
స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. పాపులర్ బ్రాండ్ Oppo నుంచి మరో క్రేజీ మోడల్ రాబోతోంది. కంపెనీ 'Oppo A7 Pro' లాంచ్ డేట్‌ను అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ కొత్త ఫోన్ సెప్టెంబర్ 11న చైనా మార్కెట్లో లాంచ్ కానుంది. మైండ్ బ్లావింగ్ 8000mAh బ్యాటరీ, స్మూత్ ఓలెడ్ డిస్‌ప్లే, వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ కోసం IP69K రేటింగ్ లాంటి సాలిడ్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను ప్లాన్ చేశారు.
ధర ఎంత ఉండొచ్చు?
చైనా మార్కెట్లో ఈ ఫోన్ ప్రైస్ సుమారు 2,000 యువాన్లు ఉండొచ్చని లీక్స్ చెప్తున్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 28,000 వరకు ఉండొచ్చు. ప్రస్తుతం చైనా లాంచ్ డేట్ మాత్రమే కన్ఫర్మ్ అయింది. ఇండియా అండ్ ఇతర గ్లోబల్ మార్కెట్లలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో సెప్టెంబర్ 11 లాంచ్ ఈవెంట్‌లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
సూపర్ స్మూత్ 120Hz ఓలెడ్ డిస్‌ప్లే
లీక్ అయిన వివరాల ప్రకారం.. Oppo A7 Proలో 6.57 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ (OLED) డిస్‌ప్లే ఉండే ఛాన్స్ ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇస్తున్నారు. దీనివల్ల ఫోన్ స్క్రోలింగ్, గేమింగ్ అండ్ ఆప్స్ యూజ్ చేసేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే 1.07 బిలియన్ కలర్స్ సపోర్ట్‌తో కలర్స్ అండ్ విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి.
ప్రాసెస్ అండ్ స్టోరేజ్ పెర్ఫార్మెన్స్
ఈ కొత్త Oppo ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 చిప్‌సెట్‌తో రానుందని టాక్. దాంతో పాటు 8GB RAM అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కాంబినేషన్‌లో వచ్చే అవకాశం ఉంది. మీకు ఇంకా ఎక్స్‌ట్రా స్పేస్ కావాలంటే మెమరీ కార్డ్ వేసుకుని 2TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే టీవీ, ఏసీ లాంటి గ్యాడ్జెట్స్ కంట్రోల్ చేయడానికి ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు.
కెమెరా డిజైన్ అండ్ ఫీచర్స్
ఫోన్ బ్యాక్ సైడ్ హారిజాంటల్ (అడ్డంగా ఉండే) మాడ్యూల్ డిజైన్‌లో 50MP మెయిన్ కెమెరాని LED ఫ్లాష్‌తో ఇస్తున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా ఉండనుంది. నార్మల్ ఫోటోగ్రఫీ అండ్ డైలీ యూసేజ్‌కి ఈ కెమెరా సెటప్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
8000mAh మాసివ్ బ్యాటరీ అండ్ IP69K రేటింగ్
ఈ ఫోన్‌లో మెయిన్ హైలైట్ ఏంటంటే.. ఏకంగా 8000mAh కెపాసిటీ ఉన్న రాక్షస బ్యాటరీ! దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే హెవీ యూసేజ్‌లో కూడా రోజంతా టెన్షన్ లేకుండా వాడేయొచ్చు. వీటితో పాటు డ్యూరబిలిటీకి Oppo పెద్ద పీట వేసింది. IP69K రేటింగ్‌తో వస్తున్నందున వాటర్, డస్ట్ అండ్ ప్రెజర్ వాటర్ జెట్స్ నుంచి ఫోన్‌కి ఫుల్ ప్రొటెక్షన్ లభిస్తుంది.




