భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు.. మే 7న రానున్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6.. ధరెంతంటే?

OnePlus Nord CE 6 Launch: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 సిరీస్ భారత మార్కెట్లో మే 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల కానుంది.

Venkat
Published on: 30 April 2026 4:23 PM IST
OnePlus Nord CE 6
X

భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు.. మే 7న రానున్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6.. ధరెంతంటే?

OnePlus Nord CE 6 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తన సరికొత్త 'నార్డ్' సిరీస్‌తో భారత మార్కెట్‌ను పలకరించబోతోంది. అత్యంత భారీ బ్యాటరీ, అధునాతన కెమెరా ఫీచర్లతో రూపొందిన నార్డ్ సీఈ 6, నార్డ్ సీఈ 6 లైట్ మోడళ్లు మే 7న విడుదల కానున్నాయి. మధ్యతరగతి వినియోగదారుల బడ్జెట్‌కు తగినట్లుగా, అద్భుతమైన పనితీరును ఇవి అందించబోతున్నాయి.

మే 7న లాంచ్.. సేల్ డేట్స్ ఇవే..!

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 సిరీస్ భారత మార్కెట్లో మే 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల కానుంది. విడుదలైన వెంటనే వీటి సేల్ డేట్ లను కూడా సంస్థ ప్రకటించింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 స్మార్ట్‌ఫోన్ మే 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా, నార్డ్ సీఈ 6 లైట్ మోడల్ మే 12 నుంచి విక్రయానికి రానుంది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఇవి లభించనున్నాయి.

పవర్ ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ సామర్థ్యం..

ఈ కొత్త ఫోన్ల ప్రత్యేకత వాటి బ్యాటరీ సామర్థ్యం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 మోడల్‌లో ఏకంగా 8,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు. ఇది స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరోవైపు, నార్డ్ సీఈ 6 లైట్ మోడల్ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ ప్రాసెసర్‌తో వస్తోంది. సుదీర్ఘ కాలం బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఈ ఫోన్లు వరంలా మారనున్నాయి. అంతేకాకుండా, ఈ ఫోన్లు 27 వాట్ల రివర్స్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కలిగి ఉన్నాయి.

డిస్‌ప్లే..

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6లో 1.5కె రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. రెండు ఫోన్లలోనూ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం నార్డ్ సీఈ 6లో 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ68 రేటింగ్‌ను కూడా ఇచ్చారు. మన్నిక విషయంలో మిలిటరీ గ్రేడ్ ధృవీకరణ పొందడం ఈ ఫోన్ మరో ప్రత్యేకత.

అంచనా ధర..

నార్డ్ సీఈ 6 మోడల్ మూడు రంగుల్లో లభిస్తుంది. నార్డ్ సీఈ 6 లైట్ మోడల్ రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. ధరల విషయానికి వస్తే, లైట్ వేరియంట్ సుమారు 20 వేల నుంచి 25 వేల రూపాయల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ సిరీస్ సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story