Moto Buds 2 Fusion : 55dB ANCతో మోటో బడ్స్ 2 ఫ్యూజన్.. లాంచ్‌కు రెడీ
Moto Buds 2 Fusion : భారత పర్సనల్ ఆడియో మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా సరికొత్త వ్యూహంతో
Motorola Moto Buds 2 Fusion
Moto Buds 2 Fusion : భారత పర్సనల్ ఆడియో మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇటీవలే మార్కెట్లో విజయవంతమైన 'మోటో బడ్స్ 2' సిరీస్‌ను మరింత విస్తరిస్తూ, ఈ విభాగంలో 'మోటో బడ్స్ 2 ఫ్యూజన్' పేరిట సరికొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్‌ను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా అయిన ఈ బడ్స్, వచ్చే సెప్టెంబర్ 15న మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టబోతున్నాయి. లాంచ్‌కు ముందే వీటి డిజైన్, కలర్ వేరియంట్లు , ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ధృవీకరించింది.
అద్భుతమైన ఆడియో క్వాలిటీ & టాప్ నాచ్ నాయిస్ క్యాన్సిలేషన్
మోటో బడ్స్ 2 ఫ్యూజన్ ఇయర్‌బడ్స్ మిడ్-టైర్ సెగ్మెంట్‌లో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేలా రూపొందించబడ్డాయి. ఇందులో ప్రత్యేకంగా టైటానియం కోటింగ్ కలిగిన 12.4mm డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. మోటోరోలా సొంత అకౌస్టిక్ ట్యూనింగ్‌తో రూపుదిద్దుకున్న ఈ బడ్స్, ఏకంగా 55dB వరకు డైనమిక్ యాక్టివ్ నాయిజ్ క్యాన్సిలేషన్ (ANC) ను సపోర్ట్ చేస్తాయి. బయటి శబ్దాల నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా స్పష్టమైన ఆడియోను వినడానికి, అవసరమైనప్పుడు పరిసరాల శబ్దాలను వినేందుకు ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ఎంతో దోహదపడుతుంది. క్రిస్టల్ క్లియర్ కాలింగ్ అనుభవాన్ని అందించేందుకు ఇందులో 6-మైక్రోఫోన్ సెటప్‌తో పాటు క్రిస్టల్‌టాక్ AI అల్గారిథమ్‌లను ఉపయోగించారు. ఆడియో లవర్స్ కోసం స్పేషియల్ ఆడియో, కస్టమైజబుల్ ఈక్వలైజర్‌తో కూడిన బాస్ బూస్ట్, AAC , SBC బ్లూటూత్ కోడెక్స్‌లకు ఇవి మద్దతు ఇస్తాయి.
నెక్స్ట్ లెవెల్ కనెక్టివిటీ.. భారీ బ్యాటరీ లైఫ్
సాంకేతికపరంగా ఈ ఇయర్‌బడ్స్ అత్యంత వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తాయి. ఆధునిక బ్లూటూత్ 6.0 సాంకేతికతతో పనిచేసే ఈ బడ్స్‌లో ఒకేసారి రెండు పరికరాలకు కనెక్ట్ అయ్యే డ్యూయల్-డివైస్ కనెక్షన్ , ఆటోమేటిక్ సోర్స్ స్విచింగ్ ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ పరంగా చూస్తే, ఛార్జింగ్ చింత లేకుండా ఉండేందుకు ప్రతి బడ్‌లో 62mAh, ఛార్జింగ్ కేస్‌లో 530mAh కెపాసిటీ కలిగిన భారీ బ్యాటరీలను అందించారు. ఇయర్‌బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే స్వతంత్రంగా 13 గంటలు, కేస్‌తో కలిపి మొత్తం 53 గంటల సుదీర్ఘ ప్లేబ్యాక్‌ను ఇస్తాయి. అత్యవసర సమయంలో కేవలం 10 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్‌తో ఏకంగా 3 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని పొందవచ్చు.
స్మార్ట్ ఫీచర్లు & సీరీస్ పోలికలు
ఈ ఇయర్‌బడ్స్‌కు IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, ఛార్జింగ్ కేస్‌కు IPX2 రేటింగ్ ఇచ్చారు. వీటితో పాటు ఇన్-ఇయర్ వేర్ డిటెక్షన్, ఇయర్‌బడ్ ఫిట్ టెస్టింగ్, లో-లేటెన్సీ గేమింగ్ మోడ్, మోటో AI , మోటోరోలా క్యూరా ఇంటిగ్రేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డిజైన్ పరంగా ఇవి టాప్ షూ, లారెల్, , సర్ఫ్ ది వెబ్ అనే మూడు పాంటోన్ కలర్స్‌లో లభిస్తాయి. ఇక సిరీస్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే, బడ్స్ 2లో 11mm + 6mm డైనమిక్ డ్రైవర్లు ఉండగా, ప్లస్ వేరియంట్‌లో 11mm డైనమిక్ + నోల్స్ బ్యాలెన్స్‌డ్ ఆర్మేచర్లు ఉన్నాయి. అలాగే బ్యాటరీ విషయంలోనూ ఫ్యూజన్ మోడల్ 13/53 గంటల లైఫ్‌తో ముందుండగా, బడ్స్ 2 మోడల్ 11/48 గంటలు, ప్లస్ మోడల్ 9/40 గంటల లైఫ్‌ను మాత్రమే అందిస్తాయి. మూడింటిలోనూ 55dB ANC, బ్లూటూత్ 6.0 సమానంగా ఉన్నప్పటికీ, ప్లస్ వేరియంట్ సౌండ్ బై బోస్ ట్యూనింగ్ , LHDC కోడెక్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ కొత్త మోటో బడ్స్ 2 ఫ్యూజన్ అధికారిక ధర వచ్చే వారం లాంచ్ సమయంలో వెల్లడి కానుంది.




