May Day: ప్ర‌పంచ కార్మికుల‌కు గూగుల్ గౌర‌వం.. ఈరోజు డూడుల్‌ను గ‌మ‌నించారా.?

May Day: ప్రతి సంవత్సరం మే 1న జరుపుకునే ప్ర‌పంచ కార్మికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ముఖ సెర్చ్ ఇంజ‌న్ గూగుల్ ప్రత్యేక డూడుల్ విడుదల చేసింది.

Mokshith
Published on: 1 May 2026 9:39 AM IST
May Day
X

May Day: ప్ర‌పంచ కార్మికుల‌కు గూగుల్ గౌర‌వం.. ఈరోజు డూడుల్‌ను గ‌మ‌నించారా.?

May Day: ప్రతి సంవత్సరం మే 1న జరుపుకునే ప్ర‌పంచ కార్మికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ముఖ సెర్చ్ ఇంజ‌న్ గూగుల్ ప్రత్యేక డూడుల్ విడుదల చేసింది. ఈ డూడుల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల కృషిని గౌరవించింది.

వివిధ రంగాల కార్మికులకు డూడుల్ ద్వారా గౌరవం

ఈ డూడుల్‌లో “Google” అనే పదంలోని ప్రతి అక్షరం ఒక వృత్తిని సూచించేలా డిజైన్ చేశారు. సమాజం నడవడానికి ప్రతి ఉద్యోగం ముఖ్యమని ఇది చెబుతోంది. చిన్న పని అయినా, పెద్ద పని అయినా సమాన ప్రాధాన్యం ఉందని గూగుల్ సందేశం ఇచ్చింది.

డూడుల్‌లో కనిపించే వృత్తుల ప్రత్యేకత

* మొదటి “G”లో పైప్ రిపేర్ చేస్తున్న కార్మికుడు కనిపిస్తాడు – ఇది మెయింటెనెన్స్ పనివారిని సూచిస్తుంది.

* “O”లో ఎక్స్‌రే పట్టుకున్న వ్యక్తి – వైద్య రంగాన్ని సూచిస్తుంది

* రెండో “O”లో బాక్స్ మోసే డెలివరీ వర్కర్ – లాజిస్టిక్స్ రంగం

* “G”, “L”లో టెక్నీషియన్ – ఎలక్ట్రిషియన్, ఫీల్డ్ ఇంజినీర్లు

* చివరిగా “E”లో మొక్కలు నాటుతోన్న‌ వ్యక్తి – రైతులు, తోటమాలి

గూగుల్ సందేశం ఏమిటి?

ఈ డూడుల్‌తో గూగుల్ తెలిపిన సందేశం. “మోడర్న్ వర్క్‌ప్లేస్‌ను నిర్మించిన కార్మికులు, హక్కుల కోసం పోరాడిన వారిని గౌరవిస్తున్నాం.” అంటే, నేటి సమాజం అభివృద్ధికి కార్మికులే ప్రధాన కారణమని స్పష్టం చేసింది.

లేబర్ డే అంటే ఏమిటి?

ప్ర‌పంచ కార్మికుల దినోత్స‌వం లేదా మే డే అనేది కార్మికులకు అంకితమైన రోజు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ క్లాస్ కష్టాన్ని గుర్తించి, వారి సేవలకు గౌరవం తెలిపే రోజు. ఈ రోజు ద్వారా కృషి, సహనం, అంకితభావాన్ని గుర్తు చేస్తారు.

లేబర్ డే ఎలా మొద‌లైంది.?

లేబర్ డే చరిత్ర 19వ శతాబ్దానికి చెందినది. అప్పట్లో పారిశ్రామిక విప్ల‌వ‌ సమయంలో కార్మికులు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేది. 1856లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో కార్మికులు 8 గంటల పని విధానం కోసం ఉద్యమం చేశారు. “8 గంటలు పని – 8 గంటలు విశ్రాంతి – 8 గంటలు వ్యక్తిగత జీవితం” అనే నినాదం అప్పుడే మొదలైంది.

భారతదేశంలో మొదటి లేబర్ డే 1923లో చెన్నైలో జరిపారు. దీనిని లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్తాన్ నిర్వహించింది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story