Lenovo Legion Y70 : గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. లెనోవా లెజియన్ Y70 (2026) ఫీచర్లు లీక్.!

Lenovo Legion Y70 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు ఎప్పుడూ ఒక క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకువెళ్లడానికి లెనోవా తన కొత్త

G Krishna
Published on: 11 May 2026 12:13 PM IST
Lenovo-Legion-Y70-2026
X

Lenovo-Legion-Y70-2026

Lenovo Legion Y70 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు ఎప్పుడూ ఒక క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకువెళ్లడానికి లెనోవా తన కొత్త మొబైల్ లెనోవా లెజియన్ Y70 (2026) ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ ఫోన్ అఫీషియల్ గా రిలీజ్ అవ్వకముందే, దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ గీక్‌బెంచ్ (Geekbench) అనే బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించడంతో, దీని పర్ఫార్మెన్స్ , స్పెక్స్ ఎలా ఉండబోతున్నాయో ఒక క్లారిటీ వచ్చేసింది.

సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ , ర్యామ్

ఈ కొత్త లెనోవా ఫోన్‌లో క్వాల్కమ్ కి చెందిన మోస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) చిప్‌సెట్ ఉండబోతోంది. గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఈ మొబైల్ ఆక్టా-కోర్ ఆర్కిటెక్చర్‌తో వస్తుంది. ఇందులో రెండు కోర్లు 3.80GHz స్పీడ్‌తో, మరో ఆరు కోర్లు 3.32GHz ఫ్రీక్వెన్సీతో పనిచేస్తాయి. ఐకూ 15R , వన్‌ప్లస్ 15R వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్ ఉండటం విశేషం. పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా ఉండటం కోసం లెనోవా ఇందులో ఏకంగా 16GB ర్యామ్ ను ప్రొవైడ్ చేస్తోంది.

హీటింగ్ సమస్యలకు చెక్... అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్

గేమింగ్ ఫోన్లలో మెయిన్ ప్రాబ్లం ఫోన్ హీట్ అవ్వడం. దీనికోసం లెనోవా ఒక అదిరిపోయే సొల్యూషన్ తీసుకువచ్చింది. ఈ ఫోన్‌లో 5,500 sq mm ఏరియాతో కూడిన వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల లాంగ్ అవర్స్ గేమింగ్ ఆడినా ఫోన్ స్లో అవ్వదు, వేడెక్కదు. ఇందులో 12W లిక్విడ్ మెటల్ థర్మల్ కండక్టివిటీ , స్పెషల్ థర్మల్ జెల్ వాడటం వల్ల హీట్ చాలా త్వరగా డిస్సిపేట్ అవుతుంది.

నెట్‌వర్క్ , గేమింగ్ స్పెషల్ ఫీచర్లు

ఆన్‌లైన్ గేమ్స్ ఆడేటప్పుడు నెట్‌వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా లెనోవా ఒక ప్రొప్రైటరీ గేమింగ్ యాంటెన్నాను ఫోన్ రైట్ సైడ్ లో ఫిక్స్ చేసింది. దీనికి తోడు ఏఐ (AI) సిగ్నల్ డిటెక్షన్ , ఆటోమేటిక్ నెట్‌వర్క్ స్విచ్చింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు గేమింగ్ లో ఉన్నప్పుడు సిగ్నల్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ మొబైల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 తో రన్ అవుతుంది.

మ్యాసివ్ బ్యాటరీ బ్యాకప్

లెనోవా లెజియన్ Y70 (2026) లో అందరినీ సర్ప్రైజ్ చేసే విషయం దీని బ్యాటరీ. ఇందులో ఏకంగా 8,000mAh బ్యాటరీ ని ఇస్తున్నారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీగా రెండు రోజుల పాటు బ్యాటరీ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. గేమర్లకు ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండటం కోసం ఇంత పెద్ద బ్యాటరీని ప్లాన్ చేశారు. లెనోవా ఈసారి గేమింగ్ కేటగిరీలో తన పాత రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ , అదిరిపోయే కూలింగ్ సిస్టమ్ కలయికలో వస్తున్న ఈ ఫోన్ గేమర్లకు పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story