Best Recharge Plan: జియో vs ఎయిర్‌టెల్...5G కోసం ఏ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్?
Best Recharge Plan: జియో రూ.198, ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్లలో డేటా, వ్యాలిడిటీ, కాలింగ్, అదనపు ప్రయోజనాలు ఏ ప్లాన్‌లో ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోండి.
Best Recharge Plan: జియో vs ఎయిర్‌టెల్...5G కోసం ఏ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్?
5జీ ఫోన్ చేతిలో ఉంటే సరిపోదు.. దానికి తగ్గ రీఛార్జ్ ప్లాన్ కూడా ఉండాలి. తక్కువ ధరలో ఎక్కువ డేటా, మంచి వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్ కావాలని చాలామంది మొబైల్ యూజర్లు చూస్తుంటారు. ఈ విషయంలో జియో, ఎయిర్‌టెల్ మధ్య మంచి పోటీ ఉంది. ముఖ్యంగా జియో రూ.198 ప్లాన్, ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌ను చూస్తే.. రెండింటిలోనూ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మీ అవసరానికి ఏది సరిపోతుందో తెలుసుకోవాలంటే ప్లాన్లను ఒక్కసారి పోల్చి చూడాల్సిందే.
జియో రూ.198 ప్లాన్: తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ఈ ప్లాన్ ఆకట్టుకునేలా ఉంది. రూ.198తో రీఛార్జ్ చేసుకుంటే 14 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందుతాయి. అంటే 14 రోజుల్లో మొత్తం 28జీబీ వరకు డేటా ఉపయోగించుకోవచ్చు. వీడియోలు చూడటం, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం వంటి వాటికి ఈ డేటా ఉపయోగపడుతుంది. దీనికి అదనంగా జియో టీవీ, జియోఏఐక్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్: ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునేవారికి ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 1.5జీబీ డేటా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందుతాయి. అంటే మొత్తం 42జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. డేటాతో పాటు 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, యాపిల్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
రెండింటిలో ఏది బెటర్?: ఇక్కడే అసలు తేడా కనిపిస్తుంది. జియో ప్లాన్ ధర తక్కువ. రోజుకు 2జీబీ డేటా కూడా ఇస్తుంది. కానీ వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్ ప్లాన్‌కు రూ.349 చెల్లించాల్సి ఉన్నా.. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే రోజువారీ డేటా 1.5జీబీ మాత్రమే. అదనపు సబ్‌స్క్రిప్షన్లు కావాలనుకునేవారికి ఎయిర్‌టెల్ ప్లాన్ కొంత ఆకర్షణీయంగా ఉంటుంది.
మీకు ఏది సరిపోతుంది?: తక్కువ ఖర్చుతో రీఛార్జ్ చేసుకుని, రోజువారీ ఎక్కువ డేటా ఉపయోగించాలనుకుంటే జియో రూ.198 ప్లాన్ వైపు చూడొచ్చు. అదే తరచూ రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అదనపు ప్రయోజనాలు కావాలనుకుంటే ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్‌ను పరిశీలించవచ్చు. చివరికి.. ఎక్కువ డేటా కావాలా, ఎక్కువ వ్యాలిడిటీ కావాలా అనేది మీ వినియోగంపై ఆధారపడి ఉంటుంది.




