Jio Rs 200 Recharge Plan: జియో రూ.200 ప్లాన్.. 30 జెబి డేటా, 15 ఓటీటీలు ఫ్రీ!

Jio Rs 200 Recharge Plan: రిలయన్స్ జియో రూ.200 డేటా యాడ్-ఆన్ ప్లాన్ వివరాలు. 28 రోజుల వ్యాలిడిటీతో 30GB డేటా, 15 ప్లస్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Sept 2026 7:27 AM IST
Jio Rs 200 Recharge Plan
X

Jio Rs 200 Recharge Plan: జియో రూ.200 ప్లాన్.. 30 జెబి డేటా, 15 ఓటీటీలు ఫ్రీ!

Jio Rs 200 Recharge Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తన యూజర్ల కోసం సరికొత్త ఓటీటీ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినోదాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన రూ. 200 ప్లాన్ ద్వారా భారీ ప్రయోజనాలను అందిస్తోంది. ఇది ప్రధానంగా డేటా మరియు ఓటీటీ సేవలకు సంబంధించిన 'యాడ్-ఆన్' (Data Add-on) ప్యాక్ అని కంపెనీ తెలిపింది.

ఈ రూ. 200 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తం 30 జీబీ (30 GB) హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు కుకు టీవీ (Kuku TV) మరియు యూట్యూబ్ ప్రీమియం సహా దాదాపు 15కి పైగా ప్రముఖ ఓటీటీ వేదికల సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా పొందవచ్చు. ఈ ఫీచర్ ద్వారా స్మార్ట్ టీవీ, టాబ్లెట్ లేదా మొబైల్‌లలో ప్రకటనలు లేకుండా యూట్యూబ్ వీడియోలు చూడటంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

అయితే, ఇది కేవలం డేటా మరియు ఓటీటీ ప్రయోజనాల కోసం మాత్రమే డిజైన్ చేసిన ప్యాక్ అని, ఇందులో ఎలాంటి వాయిస్ కాలింగ్ (Voice Calling) లేదా రోజువారీ ఎస్‌ఎంఎస్ (SMS) సదుపాయాలు ఉండవని జియో స్పష్టం చేసింది. డిజిటల్ కంటెంట్ మరియు లైవ్ టీవీ ఛానెళ్లను ఎక్కువగా వీక్షించే యూజర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story