Phone: ఇలా చేస్తే త్వరగా మీ ఫోన్ పాడవుతుంది.! సెట్టింగ్స్‌లో ఇవి మార్చండి చాలు
Phone: మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎప్పుడూ 100 శాతంలో పెట్టి వాడుతున్నారా.?
Phone: ఇలా చేస్తే త్వరగా మీ ఫోన్ పాడవుతుంది.! సెట్టింగ్స్‌లో ఇవి మార్చండి చాలు
Phone: స్మార్ట్‌ఫోన్ వాడకం ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరంగా మారిపోయింది. అయితే, ఫోన్ వాడేటప్పుడు చాలామందికి తెలియకుండానే చేసే ఒక చిన్న పొరపాటు వల్ల అటు ఫోన్‌కు, ఇటు ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతోందని టెక్ నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఫోన్ డిస్‌ప్లే స్పష్టంగా కనిపించాలని చాలామంది స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎప్పుడూ 100 శాతంలో ఉంచుతారు. ఇలా మొబైల్ స్క్రీన్ బ్రైట్‌నెస్ 100 శాతంలో పెడితే ఫోన్‌తో పాటు ఆరోగ్యానికీ హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఇలా ఉన్నాయట.
ఫోన్ పాడువుతుంది:
బ్రైట్‌నెస్ పూర్తిగా పెంచడం వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా వీక్ అవుతుంది. అంతేకాకుండా ఫోన్ వేడెక్కుతుందని, ఫలితంగా ఫోన్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కంటిచూపుకు ముప్పు:
స్క్రీన్ నుంచి వచ్చే వెలుతురు వల్ల కళ్లపై ఎఫెక్ట్ పడి చూపు తగ్గే ప్రమాదం పొంచి ఉందని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా చీకటిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మరి మీ ఫోన్ త్వరగా పాడవకుండా, కళ్లు సురక్షితంగా ఉండాలంటే ఈ కింది సెట్టింగ్స్ తప్పనిసరిగా మార్చుకోవాలి..
- ఫోన్‌లో ఎప్పుడూ ఆటో బ్రైట్‌నెస్ ఫీచర్‌ను ఆన్ చేసుకోవాలి. ఇది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి స్క్రీన్ వెలుతురును ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది.
- రాత్రి వేళల్లో ఫోన్ వాడేటప్పుడు కచ్చితంగా డార్క్ మోడ్ ఆన్ చేయాలి.
- కంటిని దెబ్బతీసే కిరణాల నుంచి రక్షణ పొందడానికి ఎల్లప్పుడూ బ్లూ లైట్ ఫిల్టర్ ఉపయోగించాలి. బ్రైట్‌నెస్ విషయంలో ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ లైఫ్, మీ కంటి చూపు రెండూ సురక్షితంగా ఉంటాయి.




