భారీ బ్యాటరీతో iQOO Z11 Lite 5G ఎంట్రీ.. ఈ ధరలో బెస్ట్ డీల్.?
iQOO Z11 Lite 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) భారత మార్కెట్లోకి మరో కొత్త బడ్జెట్ 5G ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
iQOO Z11 Lite 5G
iQOO Z11 Lite 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) భారత మార్కెట్లోకి మరో కొత్త బడ్జెట్ 5G ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'iQOO Z11 Lite 5G' పేరుతో విడుదలైన ఈ ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, బిగ్ బ్యాటరీ , అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి ఎన్నో ఆకర్షణీయమైన ప్రత్యేకతలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
ధర , ఆఫర్ల వివరాలు
iQOO Z11 Lite 5G ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,499 కాగా, 6GB RAM + 128GB మోడల్ ధర రూ. 21,499 గాను, అలాగే 6GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 24,499 గాను నిర్ణయించారు. అయితే ఆరంభ ఆఫర్ల కింద యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్బీఐ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,500 తక్షణ రాయితీ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో కలిపి ఈ ఫోన్‌ను రూ. 17,999, రూ. 19,999 , రూ. 22,999 లభ్యత ధరలకే సొంతం చేసుకోవచ్చు. దీనికి తోడు 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్ఐ (No-cost EMI) సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
సేల్, లభ్యత
ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 30న మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత మార్కెట్లో అమ్మకానికి రానుంది. కొనుగోలుదారులు ఐకూ అధికారిక వెబ్సైట్, అమెజాన్, వివో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు , ప్రముఖ రిటైల్ అవుట్లెట్ల ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ ఫోన్ 'మిడ్నైట్ బ్లూ', 'సోలార్ ఫ్లేమ్' అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వస్తోంది.
డిస్ప్లే, పర్ఫార్మెన్స్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. ఇది 1,600 x 720 పిక్సెల్స్ రెసల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, , 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. ప్రొసెసింగ్ విషయానికి వస్తే, ఇందులో వాడిన 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ అత్యంత వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ OS 6 పై పనిచేసే ఈ ఫోన్లో అదనంగా 6GB వరకు వర్చువల్ ర్యామ్ విస్తరణ , మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్‌ను పెంచుకునే వెసులుబాటును కల్పించారు.
కెమెరా క్వాలిటీ
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX852 ప్రాథమిక కెమెరాతో పాటు 0.08 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను అమర్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. రాత్రివేళల్లో సైతం నాణ్యమైన ఫోటోలు తీయడానికి నైట్ మోడ్‌తో పాటు పోర్ట్రెయిట్, పానోరమా, టైమ్‌లాప్స్, స్లో-మోషన్ వంటి అనేక విధాలైన కెమెరా మోడ్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
భారీ బ్యాటరీ, చార్జింగ్
iQOO Z11 Lite ఫోన్లో 6,500mAh సామర్థ్యం గల అత్యంత భారీ బ్యాటరీని పొందుపరిచారు. ఇది 44W ఫ్లాష్‌ఛార్జ్ సాంకేతికతకు , రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుదీర్ఘ సమయం వరకు ఫోన్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చు.
డిజైన్, రక్షణ ఫీచర్లు
ఫోన్ భద్రత , మన్నికకు కంపెనీ పెద్దపీట వేసింది. ధూళి, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్‌ను అందించారు. దీనితో పాటు స్విస్ SGS ఫైవ్-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ , మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ ఉండటం వల్ల కింద పడినా త్వరగా పాడవకుండా దృఢంగా ఉంటుంది. తక్షణ లాకింగ్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు కనెక్టివిటీకి 5G, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.4, USB టైప్-సి వంటి ఆధునిక సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి.




