iPhone 18 Pro Max లీక్.. కొత్త కలర్స్‌తో ప్రీమియం లుక్.!

iPhone 18 Pro Max: పిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ 18 ప్రో మాక్స్' లాంచ్‌కు ముందే ఇంటర్నెట్‌లో..

G Krishna
Updated on: 13 Jun 2026 1:59 PM IST
iPhone 18 Pro Max
X

iPhone 18 Pro Max

iPhone 18 Pro Max: పిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ 18 ప్రో మాక్స్' లాంచ్‌కు ముందే ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రాబోతున్న ఈ ఫోన్‌కు సంబంధించిన లేటెస్ట్ డిజైన్, కలర్ వేరియంట్ల వివరాలు ఒక సరికొత్త లీక్ ద్వారా బయటకు వచ్చాయి. ఈ తాజా లీక్ ప్రకారం ఐఫోన్ 18 ప్రో మాక్స్ మూడు సరికొత్త కలర్ ఆప్షన్లలో రాబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ ప్రాసెసింగ్ పవర్, కనెక్టివిటీ , డిస్‌ప్లే డిజైన్‌పై వస్తున్న అంచనాలకు ఈ లీక్ మరిన్ని ఆసక్తికర వివరాలను జోడించింది.

మూడు వినూత్న రంగుల్లో ఐఫోన్ 18 ప్రో మాక్స్

ప్రముఖ టెక్ జర్నలిస్ట్ జాన్ రెట్టింగర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (X) ద్వారా ఐఫోన్ 18 ప్రో మాక్స్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను పంచుకున్నారు. ఈ లీక్ ప్రకారం ఫోన్ వెనుక డిజైన్‌తో పాటు మూడు కలర్ వేరియంట్లు వేర్వేరు యాంగిల్స్ నుండి కనిపిస్తున్నాయి. ఇందులో డార్క్ చెర్రీ కలర్ వేరియంట్ ఈసారి ఐఫోన్ లైనప్‌లోనే అత్యంత ప్రత్యేకంగా నిలవబోతోంది. యాపిల్ గతంలో వాడిన రెడ్ కలర్స్ లా కాకుండా, ఈ డార్క్ చెర్రీ కలర్ రెడ్ , పింక్ టోన్స్ కలయికతో చాలా సాఫ్ట్ అండ్ ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. ఇదే ఈ ఏడాది ఐఫోన్ ప్రో మోడల్స్‌కు సిగ్నేచర్ కలర్‌గా మారే అవకాశం ఉంది. అలాగే లైట్ బ్లూ కలర్ యాపిల్ గతంలో ప్రవేశపెట్టిన బ్లూ కలర్స్ కంటే కొంచెం డీప్ , ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక బ్లాక్ వేరియంట్‌లో యాపిల్ టూ-టోన్ డిజైన్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది, దీనిలో కెమెరా మాడ్యూల్ భాగం థిక్ బ్లాక్ కలర్‌లో ఉంటే, మిగిలిన వెనుక ప్యానెల్ మాత్రం మ్యాట్ ఫినిషింగ్‌తో క్లాసిక్ లుక్‌ను అందిస్తోంది.

శక్తివంతమైన ఫీచర్లు , హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్

కేవలం కలర్స్ మాత్రమే కాకుండా, ఈసారి ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో యాపిల్ భారీ మార్పులనే చేయబోతోంది. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోన్లలో నెక్స్ట్ జనరేషన్ A20 ప్రో బయోనిక్ చిప్‌సెట్‌ను వాడనున్నారు. దీనితో పాటు మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం సరికొత్త C2 మోడెమ్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. స్క్రీన్ విషయానికి వస్తే, ఐఫోన్ లవర్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నట్లుగా స్క్రీన్ పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజును ఈసారి యాపిల్ గణనీయంగా తగ్గించబోతున్నట్లు సమాచారం. అయితే బ్యాటరీ కెపాసిటీ, ఫోన్ మందం మాత్రం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న తరం మోడల్స్ లాగే ఉండే అవకాశం ఉంది.

లాంచ్ ఎప్పుడు.. ధర ఎంత ఉండొచ్చు..

ఈ అధునాతన హార్డ్‌వేర్ మార్పులు , అప్‌గ్రేడ్స్ ఉన్నప్పటికీ, యాపిల్ ఈ సరికొత్త సిరీస్ ధరలను ప్రస్తుత ఐఫోన్ ధరల శ్రేణిలోనే ఉంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఐఫోన్ 18 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరిగే యాపిల్ మెగా ఈవెంట్‌లో అధికారికంగా లాంచ్ కానున్నాయి. ఈ ఈవెంట్‌లోనే ఐఫోన్లతో పాటు యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉందనే రూమర్స్ టెక్ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story