Price Drop: రూ.69,990కే ఐఫోన్ 17 ప్రో.. ఇదేంటి ఇంత తక్కువ ధర!

iPhone 17 Pro Offer: ఐఫోన్‌ 17 ప్రో 256GBపై క్రోమా భారీ ఆఫర్‌ ప్రకటించింది. ఎక్స్ఛేంజ్‌, క్యాష్‌బ్యాక్‌తో రూ.69,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Sept 2026 3:19 AM IST
Price Drop
X

Price Drop: రూ.69,990కే ఐఫోన్ 17 ప్రో.. ఇదేంటి ఇంత తక్కువ ధర!

iPhone 17 Pro Offer: ఐఫోన్‌ కొనాలనుకునే వారికి క్రోమా అదిరిపోయే ఆఫర్‌ తీసుకొచ్చింది. లక్ష రూపాయలకు పైగా ధర ఉన్న ఐఫోన్‌ 17 ప్రోను ఎక్స్ఛేంజ్‌, బ్యాంక్‌ ఆఫర్లను ఉపయోగించుకుని ఏకంగా రూ.69,990కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో కొత్త ఐఫోన్‌ కొనాలని చూస్తున్న వారికి ఈ డీల్‌ ఆసక్తికరంగా మారింది.

ఐఫోన్‌ 17 ప్రో 256GB మోడల్‌ భారత్‌లో రూ.1,34,900 ప్రారంభ ధరతో విడుదలైంది. అయితే క్రోమా అందిస్తున్న ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో ధర భారీగా తగ్గించుకోవచ్చు. మీ దగ్గర ఐఫోన్‌ 15 ప్రో ఉంటే మరింత లాభం. దాన్ని ఎక్స్ఛేంజ్‌ చేస్తే గరిష్ఠంగా రూ.44,500 వరకు విలువ లభిస్తుంది. దీనికి అదనంగా రూ.12,000 వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కూడా పొందొచ్చు.

ఇక ఇక్కడితో ఆఫర్‌ ఆగిపోలేదు. ఎంపిక చేసిన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో చెల్లిస్తే మరో రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఏయూ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులపై ఈ ప్రయోజనం అందుబాటులో ఉంది. ఐడీఎఫ్‌సీ కార్డ్‌ ఈఎంఐపై కొన్ని సందర్భాల్లో రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ కూడా లభించే అవకాశం ఉంది.

రూ.3,499 విలువైన కేస్‌ ఫ్రీ!

ఫోన్‌ కొంటే కేస్‌ కూడా కొనాల్సిందే కదా! కానీ ఇక్కడ ఆ ఖర్చు కూడా తప్పించుకోవచ్చు. ఐఫోన్‌ 17 ప్రో సిరీస్‌ కొనుగోలు చేసే వారికి రూ.3,499 విలువైన హైఫెన్‌ కేస్‌ కాంబోను క్రోమా ఉచితంగా అందిస్తోంది.

అంతేకాదు.. ఐఫోన్‌తో పాటు యాపిల్‌కేర్‌+ తీసుకునే కస్టమర్లకు 10 శాతం వరకు డిస్కౌంట్‌ కూడా ఉంది. ఫోన్‌కు అనుకోకుండా డ్యామేజ్‌ అయితే అదనపు రక్షణ పొందాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.

ప్రో మ్యాక్స్‌పైనా భారీ డీల్‌

ఐఫోన్‌ 17 ప్రోతో పాటు ప్రో మ్యాక్స్‌పైనా క్రోమా ఆఫర్‌ అందిస్తోంది. ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ 256GB వేరియంట్‌ రూ.74,990 నుంచి లభిస్తోంది. 512GB ఐఫోన్‌ 17 ప్రో మోడల్‌ రూ.88,490కు, ప్రో మ్యాక్స్‌ 512GB వేరియంట్‌ రూ.94,990కు అందుబాటులో ఉన్నట్లు తాజా వివరాలు చెబుతున్నాయి.

అయితే ఎక్స్ఛేంజ్‌ విలువ, క్యాష్‌బ్యాక్‌, బ్యాంక్‌ ఆఫర్లు పాత ఫోన్‌ మోడల్‌, కండిషన్‌, ఉపయోగించే కార్డు, ఇతర నిబంధనలపై ఆధారపడి మారవచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు క్రోమాలో పూర్తి ఆఫర్‌ వివరాలను చెక్‌ చేసుకోవడం మంచిది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్