WhatsApp Secret Trick: వందల మెసేజ్‌లతో విసిగిపోయారా..? ఒక్క సెకనులో వాట్సాప్‌ చాట్ స్క్రీన్ క్లీన్ చేసే ట్రిక్ ఇదిగో.!

WhatsApp Secret Trick: ప్రతిరోజూ వచ్చే వందలాది మెసేజ్‌ల నోటిఫికేషన్ల వల్ల కొన్నిసార్లు ముఖ్యమైన చాట్‌లను గుర్తించడం కష్టమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వాట్సాప్ ఒక అద్భుతమైన ఆఫ్షన్ అందించింది.

Venkat
Published on: 25 April 2026 4:25 PM IST
WhatsApp Secret Trick
X

WhatsApp Secret Trick

WhatsApp Secret Trick: మీ వాట్సాప్ అన్‌రీడ్ మెసేజ్‌ల నోటిఫికేషన్లతో నిండిపోయిందా..? ఆఫీస్ మీటింగులు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు వచ్చే వందలాది మెసేజ్‌లను ఒక్కొక్కటిగా ఓపెన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారిందా..? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన ఫీచర్. కేవలం ఒక్క నిమిషంలో మీ చాట్ స్క్రీన్‌పై ఉన్న గ్రీన్ డాట్లను మాయం చేసే సులువైన మార్గం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్ మెసేజ్‌ల గందరగోళానికి ముగింపు..

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వాట్సాప్ మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. వ్యక్తిగత సంభాషణల నుంచి ఆఫీస్ పనుల వరకు అన్నీ దీని ద్వారానే జరుగుతున్నాయి. అయితే, ప్రతిరోజూ వచ్చే వందలాది మెసేజ్‌ల నోటిఫికేషన్ల వల్ల కొన్నిసార్లు ముఖ్యమైన చాట్‌లను గుర్తించడం కష్టమవుతుంది. స్క్రీన్‌పై కనిపించే ఆ గ్రీన్ డాట్లు మనల్ని మరింత గందరగోళానికి గురిచేస్తాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి వాట్సాప్ ఒక అద్భుతమైన ఆఫ్షన్ తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు అన్ని మెసేజ్‌లను చదవకుండానే 'రీడ్' (చదివినట్లు) మార్క్ చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో 'రీడ్ ఆల్' చేయడం ఎలా?

మీ మొబైల్ స్క్రీన్ క్లీన్‌గా కనిపించాలంటే ఇలా చేయండి..

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.

కుడి వైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కల (త్రీ డాట్స్) గుర్తుపై నొక్కండి.

అక్కడ మీకు 'రీడ్ ఆల్' (Read all) లేదా 'మార్క్ ఆల్ యాస్ రీడ్' (Mark all as read) అనే ఆప్షన్ కనిపిస్తుంది.

దానిపై క్లిక్ చేయగానే, పెండింగ్‌లో ఉన్న మెసేజ్‌లన్నీ ఒక్కసారిగా చదివినట్లు మారిపోతాయి.

వెంటనే మీ స్క్రీన్ పై ఉన్న నోటిఫికేషన్ డాట్లు మాయమై చాట్ లిస్ట్ స్పష్టంగా కనిపిస్తుంది.

డెస్క్‌టాప్ లేదా వెబ్ వినియోగదారుల కోసం..

మీరు ఆఫీస్ పనుల కోసం కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌లో వాట్సాప్ వెబ్‌ను వాడుతుంటే, ఈ టిప్స్ పాటించండి..

బ్రౌజర్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయండి.

చాట్ లిస్ట్ పైన ఉన్న మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయండి.

అందులో 'మార్క్ ఆల్ యాస్ రీడ్' ఎంపికను ఎంచుకోండి.

అంతే, క్షణాల్లో మీ వెబ్ చాట్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి.

గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు..

ఈ 'రీడ్ ఆల్' ఫీచర్ మీరు ఆర్కైవ్ (Archived) చేసిన చాట్‌లకు వర్తించదు. ఒకవేళ మీరు ఏదైనా చాట్‌ను ఆర్కైవ్ చేసి ఉంటే, అందులోని మెసేజ్‌లను మీరు మాన్యువల్‌గా వెళ్లి మాత్రమే చదవాల్సి ఉంటుంది. అలాగే, మీరు మెసేజ్ చదివినట్లు అవతలి వారికి తెలియకూడదని అనుకుంటే, వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ (Privacy) విభాగంలో 'రీడ్ రిసిప్ట్స్' (Read Receipts) ఆప్షన్‌ను నిలిపివేయవచ్చు. దీనివల్ల మీరు మెసేజ్ చూసినా అవతలి వ్యక్తికి బ్లూ టిక్స్ కనిపించవు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story