ఛీ, ఛీ.. గూగుల్ లైవ్ లో చెత్త పనులు.. కట్ చేస్తే.. 14 ఏళ్ల బాలుడి ఘోర తప్పిదంతో కుటుంబానికి షాక్..!
Google Gemini Live: నేటి ఆధునిక కాలంలో కృత్రిమ మేధస్సు (AI) వాడకం పెరిగిపోతోంది. అయితే బ్రిటన్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు గూగుల్ జెమిని లైవ్ లో చేసిన ఒక అసభ్యకర ప్రయోగం కారణంగా గూగుల్ ఆ కుటుంబానికి చెందిన అన్ని ఖాతాలను శాశ్వతంగా నిలిపివేసింది.
ఛీ, ఛీ.. గూగుల్ లైవ్ లో చెత్త పనులు.. కట్ చేస్తే.. 14 ఏళ్ల బాలుడి ఘోర తప్పిదంతో కుటుంబానికి షాక్..!
Google Gemini Live: బ్రిటన్‌కు చెందిన ఒక కుటుంబం తమ గూగుల్ ఖాతాలన్నీ నిలిపివేయబడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ ఇంట్లోని 14 ఏళ్ల బాలుడు గూగుల్ జెమిని లైవ్ అనే కృత్రిమ మేధస్సు (ఏఐ) సాధనాన్ని అసభ్యకరమైన రీతిలో వాడటమే ఇందుకు ప్రధాన కారణం. కుటుంబ సభ్యులందరూ కలిసి వాడుతున్న ఒక ట్యాబ్ ద్వారా ఆ బాలుడు జెమిని లైవ్ కెమెరా ఫీచర్‌ను ఉపయోగించి అనుచిత ప్రయోగాలు చేశాడు. కృత్రిమ మేధస్సు వ్యవస్థ ఆ బాలుడి వయస్సును, అతను చేస్తున్న పనిని గుర్తించి వెంటనే గూగుల్ భద్రతా విభాగాలను అప్రమత్తం చేసింది.
కుటుంబంపై గూగుల్ కఠిన చర్యలు..
ఈ ఘటన జరిగిన వెంటనే గూగుల్ ఆ ట్యాబ్ కు అనుసంధానించబడి ఉన్న అన్ని గూగుల్ ఖాతాలను నిలిపివేసింది. కేవలం ఆ బాలుడి ఖాతా మాత్రమే కాకుండా, అతని కుటుంబ సభ్యులకు చెందిన వ్యక్తిగత, వ్యాపార ఖాతాలను కూడా గూగుల్ నిలిపివేయడం గమనార్హం. దీనివల్ల ఆ కుటుంబం గత పదేళ్లుగా దాచుకున్న ఇమెయిల్‌లు, గూగుల్ డ్రైవ్‌లోని ముఖ్యమైన డ్యాక్స్ మెంట్స్, వ్యాపార సమాచారాన్ని ఒక్క రాత్రిలోనే కోల్పోయింది.
వ్యాపారంతోపాటు చదువుపై ప్రభావం..
ఈ అకస్మాత్తు చర్య వల్ల ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది. వ్యాపారానికి సంబంధించిన బుకింగ్‌లు, వినియోగదారుల సమాచారం గూగుల్ ఖాతాతోనే ముడిపడి ఉండటంతో వారు వాటిని యాక్సెస్ చేయలేకపోతున్నారు. అంతేకాకుండా, ఆ కుటుంబంలోని ఒక విద్యార్థి తన విశ్వవిద్యాలయ పరిశోధనా పత్రాన్ని (డిసర్టేషన్) గూగుల్ డాక్స్‌లో భద్రపరుచుకున్నాడు. ఇప్పుడు అది కూడా అందుబాటులో లేకుండా పోయింది. గూగుల్ యాజమాన్యాన్ని సంప్రదించగా, 'బాలల రక్షణ' నిబంధనల ప్రకారం ఈ ఖాతాలను పునరుద్ధరించడం కుదరదని వారు స్పష్టం చేశారు.
గూగుల్ కఠిన నిబంధనలు ఇవే..
గూగుల్ తన కృత్రిమ మేధస్సు వినియోగ విధానంలో చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా మైనర్లు లైంగిక ప్రయోగాలు చేయడం లేదా వయస్సు పరిమితులను ఉల్లంఘించడం వంటి పనులు చేస్తే గూగుల్ వెంటనే చర్యలు తీసుకుంటుంది. కృత్రిమ మేధస్సులోని ఆటోమేటెడ్ వ్యవస్థలు ఇటువంటి చర్యలను గుర్తించి, చట్టపరమైన నిబంధనల మేరకు ఖాతాలను శాశ్వతంగా తొలగిస్తాయి. ఇటువంటి సందర్భాలలో అప్పీల్ చేసుకున్నప్పటికీ ఖాతాలు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఘటన క్లౌడ్ సేవలపై మనం ఎంతగా ఆధారపడుతున్నామో, డిజిటల్ భద్రత పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిస్తోంది.




