Google Pixel 11 Leaks: టెన్సర్ G6 చిప్‌తో నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్.. ఫీచర్లు ఇవే.!
Google Pixel 11 Leaks: గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా గతేడాది పిక్సెల్ 10 సిరీస్‌ను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి
Google-Pixel-11-Leaks
Google Pixel 11 Leaks: గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా గతేడాది పిక్సెల్ 10 సిరీస్‌ను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిక్సెల్ 10 మోడల్స్ అత్యంత శక్తివంతమైన టెన్సర్ G5 (Tensor G5) చిప్‌సెట్‌తో పనిచేస్తున్నాయి. అయితే, గూగుల్ తన తదుపరి తరం స్మార్ట్‌ఫోన్‌లు అయిన పిక్సెల్ 11 (Pixel 11) సిరీస్‌పై ఇప్పటికే దృష్టి సారించినట్లు సమాచారం. తాజాగా ఈ సిరీస్‌లో ఉపయోగించబోయే టెన్సర్ G6 (Tensor G6) చిప్‌సెట్‌కు సంబంధించిన కీలక వివరాలు నెట్టింట లీక్ అయ్యాయి.
టెన్సర్ G6: తక్కువ కోర్లు.. ఎక్కువ వేగం!
ప్రముఖ టిప్‌స్టర్ 'మిస్టిక్ లీక్స్' (MysticLeaks) అందించిన సమాచారం ప్రకారం, గూగుల్ తన తదుపరి చిప్‌సెట్ టెన్సర్ G6లో ఒక కీలక మార్పు చేయబోతోంది. సాధారణంగా కోర్ల సంఖ్య పెరిగితే వేగం పెరుగుతుందని భావిస్తారు, కానీ గూగుల్ ఈసారి ఒక కోర్‌ను తగ్గించి (7-కోర్ సీపీయూ) పనితీరును మాత్రం గణనీయంగా పెంచాలని చూస్తోంది.
ఇందులో ఒక ARM C1-Ultra ప్రైమ్ కోర్ (4.11GHz), నాలుగు ARM C1-Pro పెర్ఫార్మెన్స్ కోర్లు (3.38GHz), , రెండు ARM C1-Pro ఎఫిషియెన్సీ కోర్లు (2.65GHz) ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న టెన్సర్ G5 గరిష్టంగా 3.78GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుండగా, రాబోయే టెన్సర్ G6 ఏకంగా 4.11GHz వేగంతో సరికొత్త రికార్డులను సృష్టించనుంది. ఈ చిప్‌సెట్‌ను 'PowerVR C-Series' జీపీయూ (GPU) తో జత చేయనున్నట్లు సమాచారం.
పిక్సెల్ 11 సిరీస్ మోడల్స్ , కోడ్ నేమ్స్
లీక్ అయిన రిపోర్టుల ప్రకారం, ఈ సరికొత్త టెన్సర్ G6 చిప్‌సెట్ మొత్తం మూడు ప్రధాన మోడల్స్‌లో కనిపించనుంది. గూగుల్ వీటికి అంతర్గతంగా ఆసక్తికరమైన కోడ్ నేమ్స్ కూడా పెట్టింది. గూగుల్ పిక్సెల్ 11 (Google Pixel 11): కోడ్ నేమ్ 'Cubs'. పిక్సెల్ 11 ప్రో (Pixel 11 Pro): కోడ్ నేమ్ 'Grizzly'. పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్ (Pixel 11 Pro XL): కోడ్ నేమ్ 'Kodiak'.
డిస్‌ప్లే , ఇతర స్పెసిఫికేషన్లు
డిస్‌ప్లే: గూగుల్ పిక్సెల్ 11 కేవలం ప్రాసెసర్ పరంగానే కాకుండా, ఇతర ఫీచర్లలో కూడా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. ఇందులో 6.3-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉండనుంది. ఇది హై రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.
స్టోరేజ్ & ర్యామ్: ఈ ఫోన్ 12GB RAMతో రానుంది. బేస్ మోడల్ 128GB స్టోరేజ్ను కలిగి ఉండే అవకాశం ఉంది.
బ్యాటరీ & మోడెమ్: ఇందులో 5,000mAh బ్యాటరీని అమర్చనున్నట్లు తెలుస్తోంది. అలాగే మెరుగైన కనెక్టివిటీ కోసం మీడియాటెక్ M90 మోడెమ్‌ను (MediaTek M90 modem) ఉపయోగించనున్నారు.
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ విడుదల కావడానికి ఇంకా చాలా నెలల సమయం ఉంది. కంపెనీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ లీక్ అయిన ఈ ఫీచర్లు నిజమైతే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గూగుల్ మరోసారి సంచలనం సృష్టించడం ఖాయం.



