Electricity from Tyres: టైర్లతో విద్యుత్‌ ఉత్పత్తి...ఐఐసీటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

Electricity from Tyres: రోడ్డుపై తిరిగే వాహనాల టైర్ల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది.

Balachander
Published on: 10 April 2026 11:00 AM IST
Electricity from Tyres
X

Electricity from Tyres

Electricity from Tyres: రోడ్డుపై తిరిగే వాహనాల టైర్ల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది. ఇదే ఐడియాతో హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టారు. ఇది భవిష్యత్తు స్మార్ట్‌ వాహన రంగంలో పెద్ద మార్పును తీసుకురానుంది.

పవర్‌ ప్లాంట్‌గా మారనున్న టైర్లు

సాధారణంగా వాహనం నడుస్తున్నప్పుడు టైర్లు వేడెక్కుతాయి. వైబ్రేషన్లు వస్తుంటాయి. దీని నుంచి కొంత శక్తి వృధా అవుతుంది. ఇలా వృధా అయ్యే శక్తిని విద్యుత్‌గా మార్చడమే ఈ ఆవిష్కరణ ముఖ్యోద్దేశం. డాక్టర్‌ ఉజ్వల్‌ పాల్‌ నేతృత్వంలోని బృందం ట్రిబో ఎలక్ట్రిక్‌ నానో జనరేటర్ టెక్నాలజీతో స్మార్ట్‌ పవర్‌ వీల్‌ను రూపొందించారు. ఈ వీల్ నుంచి పవర్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ టెక్నాలజీ వివరాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ అడ్వాన్డ్స్‌ ఫంక్షనల్‌ మెటీరియల్స్‌లో ప్రచురితమయ్యాయి.

మూడు కీలక మార్పులు

ఈ టెక్నాలజీ కొత్తది కాదు. కానీ, ఈ టెక్నాలజీలో శాస్త్రవేత్తలు మూడు కీలక మార్పులు చేశారు. దీంతో టైర్ల పనితీరును మరింత మెరుగుపరిచారు. ఇందులో మొదటి మార్పు ఏమంటే... సాధారణ ప్లాస్టిక్‌ లేదా మెటల్‌ పొరల స్థానంలో మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ అనే ప్రత్యేక పదార్ధాన్ని ఉపయోగించారు. ఇందులో ఉద్దేశపూర్వకంగా చిన్న లోపాలను సృష్టించడం వలన ఎలక్ట్రాన్‌ కదలిక వేగంగా జరిగి, తక్కువ ఒత్తిడితో ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ పరికరాన్ని త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో తయారు చేశారు. ఫలితంగా తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం సులభం అవుతుంది. అలాగే వాహన టైర్‌లో సరిపోయేలా దీనిని కస్టమ్‌ డిజైన్‌ కూడా చేసుకోవచ్చు. ఇది రెండో మార్పు. ఇక మూడో మార్పు ఏమంటే...దీనిని కేవలం ఒక పరికరంలా మాత్రమే కాకుండా స్మార్ట్‌ పవర్‌ వీల్‌గా మార్చడం. టైర్‌ కదలికతో పాటు రోడ్డుపై తిరుగుతున్నప్పుడు రాపిడితో ఉత్పత్తి అయ్యే వేడిని విద్యుత్‌గా మారుస్తుంది.

స్మార్ట్‌ పవర్‌ వీల్‌ ప్రయోజనాలు

టైర్లలో ఎంత ప్రెజర్‌ ఉందో చూపే సెన్సర్లు, బ్రేక్‌ సెన్సర్లకు అవసరమైన కరెంట్‌ ఈ పవర్‌ వీల్‌ ద్వారా అందుతుంది. అంతేకాదు, చిన్న చిన్న ఎలక్ట్రిక్‌ పరికరాలకు బ్యాటరీలతో అవసరం ఉండదు. పవర్‌ వీల్‌ నుంచి వచ్చే ఎలక్ట్రిక్‌ను ఉపయోగించుకోవచ్చు. చిన్న చిన్న బ్యాటరీలతో అవసరం ఉండదు కాబట్టి వాటి వినియోగం తగ్గిపోతుంది. తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. మరో గమనించ దగిన విషయం ఏమంటే... వాహనం వేగం, టైర్‌ కండీషన్‌ వంటి అంశాలను ఈ పరికరం రియల్‌ టైమ్‌లో ట్రాక్‌ చేస్తుంది. ఎప్పటికప్పుడు డ్రైవర్‌ను అలర్ట్‌ చేస్తుంది.

మొత్తంగా చూసుకుంటే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే టైర్లు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు..కరెంట్‌ తయారీకి కూడా కేరాఫ్‌ అడ్రస్‌గా మారతాయి. ఇది మన శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయంగా కూడా చెప్పవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story