Nothing: టెక్ లోకంలో కొత్త సెన్సేషన్.. ఇండియాలోకి 'CMF Watch 3 Pro' ఎంట్రీ.!
Nothing: నథింగ్ (Nothing) సబ్-బ్రాండ్ CMF నుంచి మరో విప్లవాత్మకమైన స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది.
CMF Watch 3 Pro
Nothing: నథింగ్ (Nothing) సబ్-బ్రాండ్ CMF నుంచి మరో విప్లవాత్మకమైన స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. జూలై 2025లో గ్లోబల్ మార్కెట్‌లో తన సత్తా చాటిన CMF Watch 3 Pro, ఇప్పుడు భారతీయ టెక్ ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన టీజర్లు సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉన్న అద్భుతమైన ఫీచర్లు, ప్రత్యేకతలపై ఒక లుక్కేద్దాం.
ప్రీమియం మెటల్ బిల్డ్, ఆకర్షణీయమైన రంగులు
CMF Watch 3 Pro కేవలం ఫీచర్ల పరంగానే కాకుండా, లుక్ పరంగా కూడా చాలా క్లాసీగా ఉండబోతోంది. ఇది అత్యంత దృఢమైన మెటల్ బిల్డ్‌తో తయారైంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఇది నాలుగు సరికొత్త లైట్ గ్రీన్ (Light Green), డార్క్ గ్రే (Dark Grey), లైట్ గ్రే (Light Grey), ఆరెంజ్ (Orange) రంగుల్లో లభిస్తుందని కంపెనీ ధృవీకరించింది.
అబ్బురపరిచే అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే
రిజల్యూషన్: ఈ స్మార్ట్‌వాచ్‌లో గ్లోబల్ వేరియంట్ తరహాలోనే 1.43-అంగుళాల రౌండ్ AMOLED డిస్‌ప్లేను అమర్చారు. 466x466 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది.
రీఫ్రెష్ రేట్: 60Hz రీఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ వాడుక చాలా స్మూత్‌గా ఉంటుంది.
బ్రైట్‌నెస్: 670 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా.. 120కి పైగా వాచ్ ఫేసెస్ సపోర్ట్ ఉంటుంది.
AI కోచ్‌తో ఫిట్‌నెస్ మరింత స్మార్ట్!
AI రన్నింగ్ కోచ్: ఈ వాచ్‌లో ఫిట్‌నెస్ ప్రియుల కోసం కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. పర్సనలైజ్డ్ ట్రైనింగ్ ఇన్సైట్స్ ను అందించడానికి ఇందులో AI-ఆధారిత రన్నింగ్ కోచ్‌ను ప్రవేశపెట్టారు.
డ్యూయల్-బ్యాండ్ GPS: రన్నింగ్, సైక్లింగ్ వంటి అవుట్‌డోర్ యాక్టివిటీలలో ఖచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ కోసం డ్యూయల్-బ్యాండ్, మల్టీ-సిస్టమ్ GPS ఉంది. వీటితో పాటు.. టెక్నాలజీని మరింత అందిపుచ్చుకునేందుకు.. ఈ వాచ్ ద్వారా నేరుగా ChatGPT సేవలను పొందవచ్చు.
హెల్త్ ట్రాకింగ్: మెరుగైన హార్ట్ రేట్ మానిటరింగ్ , అడ్వాన్స్‌డ్ స్లీప్ సైకిల్ ట్రాకింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
బ్యాటరీ, కనెక్టివిటీ
బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంతో 13 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. హెవీ యూసేజ్‌లో 10 రోజులు, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే (AOD)తో 4 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది.
IP68 రేటింగ్: దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం దీనికి IP68 రేటింగ్ ఇవ్వబడింది.
నథింగ్ ఎక్స్ యాప్: దీని ద్వారా మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరా కంట్రోల్ , జెస్చర్ కంట్రోల్ వంటి ఫీచర్లను వాడవచ్చు.
ధర విషయానికొస్తే..
CMF Watch 3 Pro లాంచ్ తేదీ, ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇది ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా విక్రయించబడనుందని సంస్థ స్పష్టం చేసింది. గ్లోబల్ మార్కెట్ ధరల ఆధారంగా చూస్తే, ఇది భారతీయ మార్కెట్లో చాలా పోటీ ధరకే లభించే అవకాశం ఉంది.




