విద్యార్థుల కోసం బెస్ట్ 5 స్మార్ట్‌ఫోన్స్.. తక్కువ ధరలో అదిరిపోయే కెమెరా!
Best Smartphones: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే విద్యార్థులకు ఇప్పుడు అద్భుతమైన మెడల్స్ అందుబాటులోకి వచ్చాయి.
విద్యార్థుల కోసం బెస్ట్ 5 స్మార్ట్‌ఫోన్స్.. తక్కువ ధరలో అదిరిపోయే కెమెరా!
Best Smartphones: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రూ. 15,000 విభాగం అంటేనే ఎంతో పోటీతో కూడుకున్నది. గతంలో ఈ ధరలో ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. సూపర్ ఫాస్ట్ 5G, అమోలెడ్ స్క్రీన్లు, 6500mAh వంటి భారీ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల చదువులకు, గేమింగ్‌కు, ఫోటోగ్రఫీకి ఉపయోగపడే ఆ ఫోన్లు ఏవో ఓసారి చూద్దాం.
1. శామ్సంగ్ గెలాక్సీ M15 5G: స్క్రీన్ నాణ్యతను కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఇందులో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 సపోర్ట్ తో వస్తున్న ఈ ఫోన్ ధర ఆన్‌లైన్ స్టోర్లలో సుమారు రూ. 14,499 నుంచి ప్రారంభమవుతుంది.
2. ఐకూ Z10x 5G: వేగవంతమైన పనితీరును ఆశించే విద్యార్థుల కోసం ఐకూ Z10x ఒక గొప్ప ఆప్షన్. ఇందులో డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ఉంది. దీని ప్రత్యేకత 6,500mAh బ్యాటరీ. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర సుమారు రూ. 13,700 గా ఉంది.
3. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 (నథింగ్): విభిన్నమైన డిజైన్, క్లీన్ సాఫ్ట్‌వేర్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్. ఇందులో అనవసరమైన యాప్స్ ఉండవు. ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో కలిపి దీనిని రూ. 15,000 లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
4. పోకో M6 ప్లస్ 5G: ఫోటోగ్రఫీ, స్పష్టమైన వీడియో కాలింగ్ కోసం పోకో మంచి బ్యాలెన్స్ అందిస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, ఫుల్ HD+ డిస్‌ప్లే ఉన్నాయి. దీని ధర మార్కెట్లో రూ. 14,999 కి లభిస్తోంది.
5. ఒప్పో K12x 5G: ఎక్కువ సమయం ఫోన్ వాడే వారికి ఇది అనువైనది. ఇందులో కూడా 6,500mAh భారీ బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ కోసం తక్కువ సమయం కేటాయించి, ఎక్కువ సమయం ఫోన్ వాడాలనుకునే వారికి రూ. 14,999 ధరలో ఇది మంచి డీల్.
ఫోన్ కొనేటప్పుడు విద్యార్థులు గమనించాల్సిన చిట్కాలు..
డిస్‌ప్లే: మెరుగైన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎల్లప్పుడూ అమోలెడ్ ప్యానెల్ ఉన్న ఫోన్లను ఎంచుకోండి.
బ్యాటరీ: మీరు గేమింగ్ లేదా ఎక్కువ ప్రయాణాలు చేసేవారైతే 6,000mAh కంటే తక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్లను తీసుకోవద్దు.
ప్రాసెసర్: మల్టీటాస్కింగ్ కోసం లేటెస్ట్ చిప్‌సెట్లను చెక్ చేసుకుని తీసుకోవాలి.




