Portable AC Mini Cooler: రూ. 1000 లోపే పోర్టబుల్ ఏసీ.. ఎండలకు చెక్ పెట్టే మినీ కూలర్!

Best Portable Mini Air Cooler for Summer: వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు సీఆర్టీఎల్ పోర్టబుల్ మినీ కూలర్. అమెజాన్‌లో రూ. 998 కే లభ్యం.

Arun Chilukuri
Published on: 4 April 2026 10:36 AM IST
Portable AC Mini Cooler: రూ. 1000 లోపే పోర్టబుల్ ఏసీ.. ఎండలకు చెక్ పెట్టే మినీ కూలర్!
X

Portable AC Mini Cooler: రూ. 1000 లోపే పోర్టబుల్ ఏసీ.. ఎండలకు చెక్ పెట్టే మినీ కూలర్!

Best Portable Mini Air Cooler for Summer: భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. 45 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలతో ఇంట్లో ఉండటమే కష్టంగా మారుతోంది. ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుని పని చేసే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఏసీలు, పెద్ద కూలర్లు వేసినా కరెంట్ బిల్లుల భయం వెంటాడుతోంది. ఇలాంటి వారి కోసం మార్కెట్లోకి ఒక అద్భుతమైన 'పోర్టబుల్ మినీ ఎయిర్ కూలర్' అందుబాటులోకి వచ్చింది.

తక్కువ ధర.. అదిరిపోయే ఫీచర్లు:

సీఆర్టీఎల్ (CRTL) సంస్థ రూపొందించిన ఈ కొత్త పోర్టబుల్ ఎయిర్ కూలర్ ప్రస్తుతం అమెజాన్‌లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. దీని ప్రత్యేకతలు ఇవే.. కేవలం 299 గ్రాముల బరువుతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. రాత్రి వేళల్లో బెడ్ లాంప్‌లా ఉపయోగపడేలా ఇందులో నైట్ లైట్ ఫీచర్ కూడా ఉంది. మూడు బ్లేడ్లతో కూడిన ఫ్యాన్ ఎలాంటి సౌండ్ లేకుండా చల్లటి గాలిని అందిస్తుంది. గాలి వేగాన్ని అడ్జస్ట్ చేసుకునేందుకు మూడు రకాల మోడ్స్ ఉన్నాయి. మొబైల్ ఛార్జర్, పవర్ బ్యాంక్ లేదా ల్యాప్‌టాప్ యూఎస్‌బీ పోర్ట్ ద్వారా దీనిని నడపవచ్చు.

భారీ డిస్కౌంట్:

ఈ మినీ కూలర్ అసలు ధర రూ. 1299 కాగా, అమెజాన్ సమ్మర్ సేల్‌లో మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది. ప్రస్తుతం ఇది కేవలం రూ. 999 కే అందుబాటులో ఉంది. ఇది కరెంట్ బిల్లును 90 శాతం వరకు ఆదా చేస్తుందని కంపెనీ చెబుతోంది. తమ ప్రియమైన వారికి వేసవి కానుకగా ఇచ్చేందుకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story