Apple M6 : వావ్.. ఆపిల్ కొత్త ప్రొసెసర్లు.. M6, M5 అల్ట్రా రివీల్..!

Apple M6 : గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తమ సరికొత్త డెస్క్‌టాప్‌ ఉత్పత్తుల శ్రేణిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ నెక్స్ట్-జనరేషన్ ప్రొసెసర్లు..

G Krishna
Published on: 26 Aug 2026 12:51 PM IST
Apple M6
X

Apple M6 

Apple M6 : గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తమ సరికొత్త డెస్క్‌టాప్‌ ఉత్పత్తుల శ్రేణిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ నెక్స్ట్-జనరేషన్ ప్రొసెసర్లు అయిన ‘ఆపిల్ సిలికాన్ ఎం6’ (Apple Silicon M6) , ‘ఎం5 అల్ట్రా’ (M5 Ultra) లను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ పవర్‌ఫుల్ చిప్‌సెట్లతో కూడిన లేటెస్ట్ మ్యాక్ మిని (2026) , మ్యాక్ స్టూడియో (2026) మోడళ్లను కూడా కంపెనీ మార్కెట్లోకి పరిచయం చేసింది. గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఎం5 ప్రాసెసర్‌కు ముందడుగుగా ఎం6 రాగా, ఎం3 అల్ట్రా తదనంతరం ఆపిల్ అందించిన అత్యంత శక్తివంతమైన అల్ట్రా సిరీస్ ప్రొసెసర్‌గా ఎం5 అల్ట్రా గుర్తింపు పొందింది.

ఆపిల్ సిలికాన్ M6.. ప్రపంచంలోనే వేగవంతమైన సింగిల్-త్రెడెడ్ పెర్ఫార్మెన్స్

ఆపిల్ కంపెనీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యంత అధునాతన 2nm (నానోమీటర్) ప్రాసెస్ టెక్నాలజీ ఆధారంగా ఈ M6 చిప్‌ను రూపొందించారు. ఆన్-డివైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వర్క్‌ఫ్లోలను వేగవంతంగా ప్రాసెస్ చేసేందుకు ఈ చిప్‌లో డ్యూయల్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గత తరాలతో పోలిస్తే 2 రెట్ల గరిష్ట కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆపిల్ సిస్టమ్ ఫ్రేమ్‌వర్క్ రెండూ న్యూరల్ ఇంజిన్‌లను ఒకేసారి ఉపయోగించుకోవడం ద్వారా ఏఐ మోడళ్లను అత్యంత వేగంగా ఎగ్జిక్యూట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

ఈ చిప్‌లోని 12-కోర్ సీపీయూ కాంప్లెక్స్‌లో 2 ప్రత్యేక 'సూపర్ కోర్స్', 4 పెర్ఫార్మెన్స్ కోర్స్ , 6 ఎఫిషియెన్సీ కోర్స్ ఉంటాయి. 'సూపర్ కోర్స్' ద్వారా సింగిల్-త్రెడెడ్ టాస్క్‌లు వేగంగా జరగడమే కాకుండా, విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. గత ఎం5 చిప్‌తో పోలిస్తే ఎం6 చిప్ మల్టీ-త్రెడ్ పెర్ఫార్మెన్స్‌లో 1.2 రెట్లు, ఒరిజినల్ ఎం1 చిప్‌తో పోలిస్తే 2.4 రెట్లు వేగంగా పని చేస్తుందని ఆపిల్ ప్రకటించింది. దీనితో పాటు అప్‌గ్రేడెడ్ షేడర్ కోర్, డైనమిక్ క్యాచింగ్ , హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ సాంకేతికతల కారణంగా గేమింగ్, గ్రాఫిక్స్ రెండరింగ్ సామర్థ్యం 50 శాతం పెరిగింది. ఈ చిప్ 32GB వరకు యూనిఫైడ్ మెమరీని, 170GB/s మెమరీ బ్యాండ్‌విడ్త్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఆపిల్ సిలికాన్ M5 Ultra.. క్వాడ్-డై ఆర్కిటెక్చర్‌తో అల్టిమేట్ పవర్

మరోవైపు, ప్రొఫెషనల్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఆపిల్ తమ మొదటి 'క్వాడ్-డై' (Quad-Die) ఆర్కిటెక్చర్ ఆధారిత M5 Ultra చిప్‌సెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ ప్రొప్రైటరీ 'ఆల్ట్రాఫ్యూజన్' (UltraFusion) ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ ద్వారా రెండు డ్యూయల్-డై M5 మాక్స్ చిప్‌లను అనుసంధానించి ఈ క్వాడ్-డై ఆర్కిటెక్చర్‌ను తయారు చేశారు. దీనివల్ల ఇంటర్-డై బ్యాండ్‌విడ్త్ 4.4TB/s కి పెరగడమే కాకుండా, నాలుగు డైలు ఒకే యూనిఫైడ్ ప్రొసెసర్‌లా అత్యంత వేగంగా పనిచేస్తాయి.

M5 Ultra ప్రాసెసర్‌లో ఏకంగా 36-కోర్ సీపీయూ (12 సూపర్ కోర్స్, 24 పెర్ఫార్మెన్స్ కోర్స్) ఉంటుంది. ఇది ఎం3 అల్ట్రా కంటే 1.25 రెట్లు ఎక్కువ సింగిల్-త్రెడెడ్, 1.3 రెట్లు ఎక్కువ మల్టీ-త్రెడెడ్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. హెవీ గ్రాఫిక్స్, సైంటిఫిక్ కంప్యూటింగ్ , పెద్ద ఏఐ మోడళ్ల కోసం ప్రతి కోర్‌లో న్యూరల్ యాక్సిలరేటర్ కలిగిన 80-కోర్ జీపీయూని ఇందులో చేర్చారు. ఇది ఎం3 అల్ట్రా కంటే 4.5 రెట్లు, ఎం1 అల్ట్రా కంటే 6 రెట్లు ఎక్కువ జీపీయూ పీక్ కంప్యూట్ పవర్‌ను విడుదల చేస్తుంది.

ఈ చిప్‌లో 32-కోర్ న్యూరల్ ఇంజిన్, అధునాతన ప్రొఫెషనల్ మీడియా ఇంజిన్‌లతో పాటు H.264, HEVC, ProRes ఎన్‌కోడ్/డీకోడ్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి. ఇది ఏకంగా 512GB వరకు యూనిఫైడ్ మెమరీని సపోర్ట్ చేయడంతో పాటు 1.2TB/s మెమరీ బ్యాండ్‌విడ్త్‌ను అందిస్తుంది. టెక్ ప్రపంచంలో హై-ఎండ్ వర్క్‌స్టేషన్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ కొత్త మ్యాక్ డివైజులు సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయనున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story