Seethampeta: ఈ నెల 9న సీతంపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం!

Seethampeta: ఈ నెల 9న సీతంపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో పవర్ స్వప్నిల్ జగన్నాథ్ పిలుపునిచ్చారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 5 Aug 2026 8:29 AM IST
Seethampeta
X

Seethampeta: ఈ నెల 9న సీతంపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం!

Seethampeta: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈ నెల 9న సీతంపేటలో ఘనంగా జరుపుకుందామని ఐటిడిఏ పిఓ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ స్పష్టం చేశారు. ఐటీడీఏ ఎస్సార్ శంకరన్ సమావేశం మందిరంలో గిరిజన సంఘాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసి దినోత్సవం గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే ఒక ముఖ్యమైన వేదిక అనిపేర్కొన్నారు.

గిరిజనుల విశిష్ట జీవన విధానం, సంప్రదాయ కళలు, జానపద నృత్యాలు,వాయిద్యాలు, సాంప్రదాయ వస్త్రధారణ, ఆహార సంస్కృతి, హస్తకళలు ప్రతిబింబించేలా ఉత్సవకార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో పాలకొండ డి.ఎస్.పి రాంబాబు, డిడి అన్నదొర. ఎంపీడీవో బిబి మిశ్రా, జేఏసీ నాయకులు బి.శ్రీనివాసరావు, అడవి రాముడు, పాలక పురుషోత్తం, బిడ్డిక ఉమామహేశ్వరరావు, నిమ్మక కాంతారావు, మూటక రవికుమార్, కె.కాంతారావు, లక్ష్మీనారాయణ, బి. రామ్మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story