Veeraghattam: వీరఘట్టంలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠా గుట్టురట్టు!
Veeraghattam: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో వ్యసనాలకు బానిసలై బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్.
Veeraghattam: వీరఘట్టంలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠా గుట్టురట్టు!
Veeraghattam: వ్యసనాలను బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న వీరఘట్టం పోలీసులు
నిందితులనుండి 5వాహనాలు స్వాధీనం.సమావేశం నిర్వహించి నిందితులను స్వాధీనం చేసుకున్న వాహనాలను మీడియా ముందు ప్రవేశపెట్టిన పాలకొండ డీఎస్పీ రాంబాబు.
చెడు వ్యసనాలకు బానిసలై ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరు ఘరానా దొంగలు పొందూరు మురళీకృష్ణ, చాట్ల చంద్రమౌళి లను వీరఘట్టం ఎస్సై షణ్ముఖరావు ఆధ్వర్యంలోని బృందం చాకచక్యంగా పట్టుకున్నారు. వీరఘట్టం మండలం కంబరవలస గ్రామంలో దొంగలించిన వాహనాన్ని అమ్మేందుకు వెళుతున్న తరుణంలో వాహన తనిఖీ నిర్వహిస్తున్న వీరఘట్టం పోలీసులు నిందితులను ప్రశ్నించగా వాహనానికి సంబందించిన ధ్రువపత్రాలు లేకపోవడం, పొంతన లేని సమాదానాలు చెప్తుండడంతో అనుమానం వచ్చి చెక్ చేయగా అది దొంగలించిన వాహనంగా గుర్తించారు.
ఇదే కాక నిందితుల విచారణలో మరో నాలుగు వాహనాలకు గతంలో దొంగలించినట్టు వాటిపై వేరు వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుకాబడినట్టు గుర్తించి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాలకొండ డీఎస్పీ రాంబాబు పత్రికా సమావేశం నిర్వహించి నిందితులన, స్వాధీనం చేసుకున్న వాహనాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు.




