Vajrapukotturu: మర్రిపాడు పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ
Vajrapukotturu: వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడు ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే గౌతు శిరీష కృషితో మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు.
Vajrapukotturu: మర్రిపాడు పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ
వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం గరుడబద్ర పంచాయతీ పరిధిలోని మర్రిపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మర్గుదొడ్ల నిర్మాణ పనులకు నేడు భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు మంజూరైన మర్గుదొడ్ల నిర్మాణ పనులను పంచాయతీ పెద్దల సమక్షంలో ప్రారంభించారు.
పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా మర్గుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ఈ నిర్మాణాలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష గ్రామీణ ప్రాంతాల్లో విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని పంచాయతీ పెద్దలు పేర్కొన్నారు. మంజూరైన పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ అధ్యక్షుడు కోనారి గణపతి, పిఎసియస్ డైరెక్టర్ రాపాక శాంతమూర్తి,మాజీ అధ్యక్షుడు మురిపింటి నారాయణ, కె. మోహనరావు, కె. వల్లభరావు, యస్ భీమా రావు,కె. గణపతి తదితరులు పాల్గొన్నారు.




