Ichchapuram: ఇచ్చాపురంలో రూ. 2.40 కోట్లతో క్రీడా వికాస కేంద్రం!

Ichchapuram: ఇచ్ఛాపురంలో రూ. 2.40 కోట్లతో క్రీడా వికాస కేంద్రానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వసతులతో నిర్మాణం చేపడతామని తెలిపారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 4 Sept 2026 5:56 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్చాపురంలో రూ. 2.40 కోట్లతో క్రీడా వికాస కేంద్రం!

Ichchapuram: ఇచ్ఛాపురంలో రూ. 2.40 కోట్లతో క్రీడా వికాస కేంద్రం అభివృద్ధి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు క్రీడారంగాన్ని ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఇచ్ఛాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇచ్ఛాపురం క్రీడా వికాస కేంద్రానికి రూ. 2.40 కోట్లు నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు.

అత్యాధునిక సదుపాయాలు:

3 బ్యాడ్మింటన్ కోర్టులు

* అధునాతన వ్యాయామశాల (జిమ్)

* అథ్లెటిక్ ట్రాక్,

* వాకింగ్ ట్రాక్

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న క్రీడా వికాస కేంద్రాలను అత్యుత్తమ వసతులతో తీర్చిదిద్దుతామని, యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు, పాఠశాలలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram

Next Story