Ichchapuram: ఇచ్చాపురం రైల్వే సమస్యకు మోక్షం మంత్రి రామ్మోహన్!

Ichchapuram: ఇచ్చాపురంలో రూ.3 కోట్లతో రెండు అండర్ బ్రిడ్జిలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్లతో ఆర్‌వోబీ కూడా మంజూరైందని వెల్లడించారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 4 Sept 2026 5:33 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్చాపురం రైల్వే సమస్యకు మోక్షం మంత్రి రామ్మోహన్!

Ichchapuram: దశాబ్దాలుగా ఇచ్చాపురం ప్రజలను పట్టి పీడిస్తున్న రైల్వే గేట్ సమస్యకు మోక్షం లభించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

ఇచ్చాపురంలో పర్యటించిన కేంద్ర మంత్రి రూ.3 కోట్ల అంచనా వ్యయంతో రెండు వైపులా రెండు రైల్వే అండర్ బ్రిడ్జిలు (RUB) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో రైల్వే ట్రాక్ కారణంగా ప్రజలు, విద్యార్థులు ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

ఇచ్చాపురం ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.50 కోట్ల నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) కూడా మంజూరైందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ROB నిర్మాణ పనులకు అతి త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

ఇచ్చాపురం ప్రజల చిరకాల డిమాండ్‌కు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని మంత్రి స్పష్టం చేశారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram

Next Story