Amadalavalasa: ఆమదాలవలస సంగీత కళాకారులకు జాతీయ స్థాయి గుర్తింపు!
Amadalavalasa: ఢిల్లీ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ఆమదాలవలస సంగీత కళాకారులు బంకుపల్లి తండ్రీ కొడుకులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సత్కరించారు.
Amadalavalasa: ఆమదాలవలస సంగీత కళాకారులకు జాతీయ స్థాయి గుర్తింపు!
Amadalavalasa: ఆమదాలవలసకు చెందిన ప్రముఖ సంగీత కళాకారులు, శ్రీ కచ్చపీ కళాక్షేత్రం ద్వారా సంగీత సేవలు అందిస్తున్న బంకుపల్లి శ్రీరామచంద్రమూర్తి శర్మ మరియు వారి కుమారుడు బంకుపల్లి దుర్గా శ్రీనివాస్ శర్మలకు సంగీత రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఢిల్లీలో ఎన్టీఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించడం పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు బంకుపల్లి శ్రీరామచంద్రమూర్తి శర్మ, బంకుపల్లి దుర్గా శ్రీనివాస్ శర్మలను ప్రత్యేకంగా అభినందించి, ఘనంగా సత్కరించారు. సంగీత కళను పరిరక్షిస్తూ, సంప్రదాయ కళలను భావితరాలకు అందించేందుకు వారు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలు, కళా వారసత్వాన్ని తరతరాలకు అందించే గొప్ప మాధ్యమమని పేర్కొన్నారు.
శ్రీ కచ్చపీ కళాక్షేత్రం ద్వారా సంగీతాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ, యువతలో కళల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు బంకుపల్లి కుటుంబం చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.ఆమదాలవలస ప్రాంతానికి చెందిన కళాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడం ద్వారా మన సాంప్రదాయ కళలు మరింతగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.
గౌరవ డాక్టరేట్‌తో పాటు మంత్రి చేతుల మీదుగా ఘన సత్కారం అందుకోవడం తమకు ఎంతో ఆనందంగా, మరింత బాధ్యతగా భావిస్తున్నామని బంకుపల్లి శ్రీరామచంద్రమూర్తి శర్మ, బంకుపల్లి దుర్గా శ్రీనివాస్ శర్మ తెలిపారు. భవిష్యత్ తరాలకు సంగీత కళా సంప్రదాయాలను అందించేందుకు తమ వంతు కృషిని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.




